ప్రాణం తీస్తోన్న ఈజీమనీ

ABN , First Publish Date - 2022-01-24T04:50:32+05:30 IST

ఈజీమనీ ఆరాటం యువత ప్రాణాలు తీస్తోంది. గంజాయి, డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ మొదలుకొని సైబర్‌ నేరాలే లక్ష్యంగా పనిచేస్తున్న ముఠాల వలలో చిక్కిన పాలమూరు యువకులు మృత్యువాత పడుతుండటం కలవరం కలిగిస్తోంది.

ప్రాణం తీస్తోన్న ఈజీమనీ

- కరుడుగట్టిన నేరస్తుల ముఠాల్లో చిక్కిన పాలమూరు యువత

- పాట్నాలో అనుమానాస్పదంగా మృతి చెందిన నలుగురు గిరిజన యువకులు

-  గంజాయి, డ్రగ్స్‌  సరఫరా.. ఆపై సైబర్‌నేరాలు

-  అధిక సంపాదన రుచి చూపిస్తోన్న ముఠాలు

-  పిల్లల వ్యవహారం  గ్రహించని తల్లిదండ్రులు

-  విచారణకు కసరత్తు చేస్తున్న పోలీసులు

ఈజీమనీ ఆరాటం యువత ప్రాణాలు తీస్తోంది. గంజాయి, డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ మొదలుకొని సైబర్‌ నేరాలే లక్ష్యంగా పనిచేస్తున్న ముఠాల వలలో చిక్కిన పాలమూరు యువకులు మృత్యువాత పడుతుండటం కలవరం కలిగిస్తోంది. సామాజిక అవగాహన లేని తల్లిదండ్రులకు వేరే రాష్ట్రాలకు వెళుతున్నామనే మాయమాటలు చెప్పి వెళ్లి నేరగాళ్ల ఉచ్చులో చిక్కి యువత జీవితాలు నాశనం చేసుకుంటున్న  పరిస్థితి ఉమ్మడి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వస్తోంది. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌, ఖిల్లాఘనపూర్‌ మండలాలకు చెందిన అయిదుగురు గిరిజన యువకులు ఇటీవల బిహార్‌ రాష్ట్రం పాట్నాలో అనుమానాస్పదంగా మృతిచెందడాన్ని పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.

 - మహబూబ్‌నగర్‌, ఆంధ్రజ్యోతి ప్రతినిధి  

ఉమ్మడి జిల్లాలోని భూత్పూర్‌, ఖిల్లాఘనపూర్‌ మండలాలకు చెందిన నలుగురు యువకులు ఇటీ వల పాట్నాలో అనుమానస్పద స్థితిలో మృతి చెందా రు. మరొకరి ఆచూకీ కూడా లభించలేదు.  మృతి చెందిన నలుగురి కుటుంబాలకు పాట్నా పోలీసుల నుంచి సమాచారం రావడంతో వెళ్లి మృతదేహాలను తీసుకు వచ్చి అంత్యక్రియలు జరుపుకున్నారు. కల్తీ మద్యం తాగి చనిపోయారని ప్రాథమికంగా  పాట్నా పోలీసులు పేర్కొనగా, పోస్ట్‌మార్టం రిపోర్టు వస్తే గానీ మృతిపై స్పష్టత వస్తుందని స్థానిక పోలీసులు పేర్కొంటున్నారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ వచ్చాక తదు పరి విచారణ జరుగుతుందని పోలీసులు పేర్కొంటు న్నారు. ఈ యువకుల మృతిపై లోతుగా ఆరా తీస్తే బయటపడుతున్న విషయాలు ఆందోళన కలిగిస్తు న్నాయి. దేశవ్యాప్తంగా యువతను నేరాల్లో విని యో గించుకునే ఒక ముఠా వీరిని ప్రలోభపెట్టి తమ ఉచ్చులో బిగించిన విషయాలు ఒక్కోటి బయటకు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ఇలాంటి యువతను ఈ ముఠాలు చెరబట్టి సైబర్‌ నేరాలు, స్మగ్లింగ్‌ వ్యవహారాల్లో  వాడుకుంటున్నారని, అవసరం తీరాక వదిలేయడమో లేక ఆనవాళ్లు లే కుండా చేయడమో చేస్తున్నారని, ఆ క్రమంలోనే తాజాగా ఈ నలుగురు యువకుల మరణాలు సంభ వించాయనే కోణంలో చర్చసాగుతోంది. 

డబ్బుకు అలవాటు చేసి..

పాలమూరు నుంచి హైదరాబాద్‌కు ఉపాధి కోసం వెళ్లిన యువకులు ప్రధానంగా 18 నుంచి 30 సంవత్సరాలలోపు వారిని లక్ష్యంగా చేసుకున్న నేర ముఠాలు వీరికి మొదట ఈజీమనీ అలవాటు చేస్తారు. మెల్లగా తమ నేర ప్రపంచంలోకి తీసుకెళ్తా రు. ఇంటర్‌, డిగ్రీ  చదువుకొని దూకుడు స్వభావం తో ఉండే యువకులనే వీరు ఎంపిక చేసుకుంటారు. రోజంతా ఆటో నడిపినా, భవన నిర్మాణ రంగంలో పనిచేసినా గరిష్టంగా రూ.1000కి మించి సంపాదిం చలేని పరిస్థితుల్లో వారికి రోజుకు రూ.10వేలు ఆపైన సంపాదన రుచి చూపించి వారి నేరముఠా లోకి దింపుతున్నారు. మహబూబ్‌నగర్‌, వనపర్తి జి ల్లాలకు చెందిన యువకులు హైదరాబాద్‌లో పని చేస్తున్న సందర్భాల్లో వారిని ట్రాప్‌ చేసిన ఒక నేరముఠా తొలుత గంజాయి, డ్రగ్స్‌ సరఫరా చేసేం దుకు వినియోగించుకున్నారని, ఆ సమయంలో రోజువారీ సంపాదన కంటే దాదాపు 20 రెట్ల అధి కంగా వీరికి ఇవ్వడంతో యువకులు తిరిగి గ్రామా ల్లోకి వచ్చి విచ్చలవిడిగా మద్యం, జల్సాలకు ఖర్చు చేసేవారని తెలిసింది. నేరముఠా చెప్పిన ఏ అసాంఘికచర్యనైనా సునాయాసంగా చేయడంతో పాటు మాట్లాడటంలో నైపుణ్యత ప్రదర్శించడం, చురుగ్గా వ్యహరించే వారిని గుర్తించిన ఈ ముఠా ద్వారానే బిహార్‌ ముఠాకు యువకులను అప్పగించా రని తెలుస్తోంది. ఈ ముఠా తెలంగాణలోని పాల మూరు ప్రాంతం వాళ్లే కాకుండా ఏపీలోని అనంత పురం, విజయనగరం జిల్లాల నుంచి కూడా  యువ కులను తీసుకెళ్తున్నారు. అదేవిధంగా దేశంలోని అన్ని భాషలకు చెందిన యువకులను పాట్నాకు చెందిన  ముఠా చెరబట్టినట్లు సమాచారం. ఈ ముఠా వీరిని పాట్నా తీసుకెళ్లి అక్కడ సైబర్‌నేరాలపై  శిక్షణ ఇచ్చి ఆ తర్వాత ఒక ల్యాప్‌టాప్‌,  కావాల్సినం త మద్యం, కోరుకున్న తిండిని అందిస్తూ వీరిచే ఫోన్ల ద్వారా నే రాలు చేయిస్తున్నారని తెలుస్తోంది. తెలుగు మాట్లా డే వారికి ప్రతీ రోజూ వంద సిమ్‌ కార్డులు, ఒక  ఫోన్‌ ఇచ్చి, వంద ఫోన్‌ నెంబర్ల లిస్టుని  ఇస్తా రని, ఒక్కో సిమ్‌ నుంచి ఒకరికి ఫోన్‌ చేసి బ్యాంకుల నుంచి మాట్లాడుతున్నామని, లేకపోతే మొబైల్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే మనీ వేస్తామని చెబుతూ ట్రాప్‌ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా బోల్తాపడి మనీ వారికి ట్రాన్స్‌ఫర్‌ చేయడమో.. లేక నెంబర్లు ఇస్తే వారే వాటిని  ఖాతాల నుంచి ట్రాన్స్‌ ఫర్‌ చేసుకోవడమే జరిగితే ఆ లావా దేవీలో 15 శా తం, 20శాతం వరకు వీరికి ఇస్తూ మిగిలిన మొత్తా న్ని ముఠానే తీసుకుంటారని తెలుస్తోంది. ఇలా కమీ షనే తప్ప రోజువారీ వేతనాలు ఏమీ ఇవ్వరని, మద్యం, భోజనం మాత్రం రోజూ సరఫరా చేస్తారని తెలుస్తోంది. ఇలా రోజుకు ఒకటి, రెండు లావా దేవీలు చేయలేకపోతే వారం రోజుల పాటు గమనిం చి వారిని అడ్డుతొలగించేందుకు కూడా వెరవడం లే దని, ఆ కోణంలోనే భూత్పూర్‌కు చెందిన యువకుల మరణాన్ని పరిగణించాల్సి ఉంటుందని అనుమానా లు వస్తున్నాయి. బిహార్‌ ముఠా ఉచ్చులో ఉమ్మడి జిల్లా నుంచి ఇంకా పలువురు యువకులు న్నారని, వారిని ఆ ముఠా నుంచి కాపాడాల్సి ఉంది.  కానీ ఎవరూ  ఫిర్యాదు  చేయకపోవడంతో పోలీసు లు ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడిందని తెలు స్తోంది. ఈ అంశంపై పాట్నా పోలీసుల నుంచి పోస్ట్‌ మార్టం రిపోర్ట్‌ వచ్చాక  స్థానిక పోలీసుశాఖ నుంచి కూడా లోతుగా విచారణ జరిపితే మరిన్ని అంశాలు వెలుగులోకి రావడంతో పాటు ఆ ముఠా ఉచ్చులో చిక్కిన పాలమూరు యువకులను కాపాడుతారనే సూచనలు వస్తున్నాయి.  నెలల తరబడి ఆచూకి తెలియని యువకుల తల్లిదండ్రులు ధైర్యంగా పోలీ సులకు ఫిర్యాదు చేస్తే ఈ ముఠా తీగలాగడానికి దోహదపడుతుందని, ఆ దిశగా తల్లిదండ్రుల్లో చైత న్యం రావాలనే  అభిప్రాయాలు వస్తున్నాయి. 


Updated Date - 2022-01-24T04:50:32+05:30 IST