Abn logo
May 15 2021 @ 00:03AM

ఆండ్రాయిడ్‌కు పోటీగా ఎఫ్‌-డ్రాయిడ్‌

ప్రపంచంలో 80 శాతానికి మించి ఫోన్లు ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌పైనే పనిచేస్తుంటాయి. సంబంధిత ప్లేస్టోర్‌ డిఫాల్ట్‌, పేమెంట్‌ యాప్‌ స్టోర్లతో నిండి ఉంటుంది.  ఇదంతా ఒకరకంగా గుత్తాధిపత్యామే. వినియోగదారు దృష్టిలో చూస్తే ఒకే కంపెనీ చేతిలో  అన్నీ ఉండటం ఎంతమాత్రం మంచిదికాదు. 


అందుకే ఈ రంగంలో గూగుల్‌ ఆధిపత్యాన్ని ఢీకొనేందుకు ప్రత్యామ్నాయ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ అభివృది చెందుతున్నాయి. వీటిలో ఆండ్రాయిడ్‌కు పోటీగా బ్రిటన్‌కు చెందిన ఎఫ్‌-డ్రాయిడ్‌ను పేర్కొనవచ్చు. ఎఫ్‌-డ్రాయిడ్‌ యాప్‌స్టోర్‌ను అభివృద్ధి పరుస్తోంది. బ్రిటిష్‌ కంప్యూటర్‌ గేమ్‌ ప్రోగ్రామర్‌ సియారన్‌ ఇ గుల్ట్‌నీక్స్‌ 2010లోనే యాప్‌స్టోర్‌ను కనుగొన్నాడు. ఆప్టాయిడ్స్‌కు చెందిన ఫోర్క్‌కోడ్‌గా ఇప్పుడు ఇది పదిహేడు కేటగిరుల్లో నాలుగు వేలకు మించి ఓపెన్‌ సోర్స్‌ యాప్‌లను కలిగి ఉంది. కనెక్టివిటీ, డెవల్‌పమెంట్‌, గేమ్స్‌, గ్రాఫిక్స్‌, ఇంటర్నెట్‌, మల్టీమీడియా, నేవిగేషన్‌, ఫోన్స్‌ అండ్‌ ఎస్‌ఎంఎస్‌, రీడింగ్‌, సైన్స్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌, సెక్యూరిటీ, స్పోర్ట్స్‌ అండ్‌ హెల్త్‌ సిస్టమ్‌, థీమింగ్‌, టైమింగ్‌, రైటింగ్‌ వంటివన్నీ వీటిలో ఉన్నాయి. 


వాస్తవానికి వేరే యాప్‌ స్టోర్‌లను ఆండ్రాయిడ్‌ అనుమతించదు. ఆ కారణంగా ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఎఫ్‌-డ్రాయిడ్‌ యాప్‌ కనిపించదు. అయితే ఎఫ్‌డ్రాయిడ్‌.ఆర్గ్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఒకసారి డౌన్‌లోడ్‌  చేసుకుంటే యాప్‌స్టోర్స్‌ అప్‌డేట్‌ అయ్యేందుకు కొద్దిగా సమయం పడుతుంది. ఇంటర్‌ఫేస్‌ సింపుల్‌గా ఉంటుంది. కేటగిరీల వారీగా సరికొత్త టైటిల్స్‌ను బ్రౌజ్‌ చేసుకోవచ్చు. కొత్తగా చేరిన వాటిని యాప్‌లోని అప్‌డేట్స్‌ విభాగం తెలియజేస్తుంది. ఎఫ్‌-డ్రాయిడ్‌లో క్లిక్‌ చేసిన యాప్‌ను బట్టి డిస్ర్కిప్షన్‌ తదితరాలు ఉంటాయి. అలాగే ఇందులో పాత వెర్షన్‌ను కూడా డౌన్‌లోడ్‌ చేసుకుని ఆ సదుపాయాలనూ పొందవచ్చు. 


సానుకూలతలు

ఎఫ్‌-డ్రాయిడ్‌తో కొన్ని సానుకూలతలు ఉన్నాయి. వినియోగదారుడి ఫోన్‌ లేదంటే డౌన్‌లోడ్‌ చేసుకున్న యాప్‌లను ట్రాక్‌ చేసే వీలు ఉండదు. వెబ్‌ సెర్వర్లకు ఎలాంటి ఐడెంటిఫికేషన్‌ సమాచారాన్ని పంపదు. ఎఫ్‌-డ్రాయిడ్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి ఈమెయిల్‌ లింక్‌పను అడగదు. ఓపెన్‌ సోర్స్‌ని సపోర్ట్‌ చేస్తుంది. ఆ కారణంగా లిస్ట్స్‌ ఆఫరింగ్స్‌ తాలూకా సోర్స్‌ కోడ్స్‌ మాత్రమే అందుబాటులో ఉంటాయి. ట్రాకింగ్స్‌ను ఎనేబుల్‌ చేసుకునేంతవరకు వినియోగదారుడు ఇన్‌స్టాల్‌ చేసుకున్న అప్లికేషన్స్‌ను ట్రాక్‌ చేయదు. పర్సనల్‌ డేటా సెక్యూరిటీ, ప్రైవసీ విషయంలో చాలా మంచి ఓపెన్‌ సోర్స్‌ యాప్‌లను ఇది కలిగి ఉంది. 


భద్రత విషయంలో అన్ని చర్యలూ తీసుకున్నప్పటికీ ఎఫ్‌-డ్రాయిడ్‌ లాభాపేక్షరహిత సంస్థ అన్న విషయం గుర్తుంచుకోవాలి. అందువల్ల అది చెప్పే అన్నింటికీ గ్యారంటీ ఉందని బల్లగుద్ది చెప్పలేం. యాక్టివ్‌ ఫోరమ్‌ అయినందున ఫిర్యాదులకు స్పందిస్తామని, ఇతర వినియోగదారులతో ఇంటరాక్ట్‌ కావచ్చని చెబుతోందనుకోండి. టెలిగ్రామ్‌, జబ్బర్‌లో కూడా ఎఫ్‌-డ్రాయిడ్‌ ఫోరం అందుబాటులో ఉంది. 


ఇతర యాప్స్‌

  • ఎఫ్‌-డ్రాయిడ్‌తోపాటు కెడిఇకి చెందిన ప్లాస్మా మొబైల్‌, పోస్ట్‌ మార్కెట్‌ ఔస్‌, పూరిజమ్‌కు చెందిన లిబ్రమ్‌, రెప్లికంట్‌ అలాంటివి కూడా ఆండ్రాయిడ్‌  ప్రత్యామ్నాయాల్లో ఉన్నాయి.
  • అయితే ఇప్పటికిప్పుడు  వంద శాతం ఇవి అద్భుతంగా పనిచేస్తాయని చెప్పలేం. అయినప్పటికీ పాత స్మార్ట్‌ ఫోన్లపై అంటే వారెంటీ పరిధి చెల్లిన వాటిపై కొత్త ప్రయోగాలు చేయవచ్చు. శాంసంగ్‌, షావోమీ, పై అభివృద్ధిపర్చిన యాప్‌స్టోర్‌లపై కన్నేయవచ్చు.
  • వాస్తవానికి వేరే యాప్‌ స్టోర్‌లను ఆండ్రాయిడ్‌ అనుమతించదు. ఆ కారణంగా ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఎఫ్‌-డ్రాయిడ్‌ యాప్‌ కనిపించదు. అయితే ఎఫ్‌డ్రాయిడ్‌.ఆర్గ్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఒకసారి డౌన్‌లోడ్‌  చేసుకుంటే యాప్‌స్టోర్స్‌ అప్‌డేట్‌ అయ్యేందుకు కొద్దిగా సమయం పడుతుంది.

ప్రత్యేకం మరిన్ని...