Sep 17 2021 @ 23:31PM

వినోదం... మూడురెట్లు!

వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘ఎఫ్‌ 3’. ‘ఎఫ్‌ 2’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ‘దిల్‌’ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో తాజా షెడ్యూల్‌ మొదలైంది. ఈసారి మూడురెట్లు వినోదం పంచుతామని చిత్రదర్శకుడు అనిల్‌ రావిపూడి తెలిపారు. ‘‘మళ్లీ చిత్రీకరణ మొదలైంది. ‘ఎఫ్‌ 3’ కుటుంబంతో సెట్స్‌కు రావడం చాలా సంతోషంగా ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ షెడ్యూల్‌లో హీరోయిన్లు తమన్నా, మెహరీన్‌, నటీనటులు అన్నపూర్ణ, వై. విజయ, సునీల్‌, రఘుబాబు, ఆలీ, ప్రగతి తదితరులు పాల్గొంటున్నారు. శరవేగంగా చిత్రీకరణ చేస్తున్నామని, ‘ఎఫ్‌ 3’ కోసం దేవిశ్రీ ప్రసాద్‌ ప్రత్యేకంగా బాణీలు సిద్ధం చేశారని నిర్మాత శిరీష్‌ చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్‌, సహ నిర్మాత: హర్షిత్‌రెడ్డి.