Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆవిరితో మెరిసే అందం

ఆంధ్రజ్యోతి(29-10-2020)

కరోనా భయం మూలంగా అందరూ రోజూ ఆవిరి పట్టడానికి అలవాటు పడ్డారు. అయితే ఆవిరి పట్టడం వల్ల ముఖం కాంతి వంతం అవుతుందని అంటున్నారు సౌందర్యనిపుణులు. 


ముఖానికి అవిరిపట్టడం వల్ల మృతకణాలు తొలగిపోయి చర్మం క్లీన్‌ అవుతుంది. రక్తసరఫరా మెరుగుపడుతుంది. చర్మం సంగ్రహించే ఆక్సిజన్‌ స్థాయి పెరిగి చర్మం కాంతివంతమవుతుంది.


మొటిమల సమస్యతో బాధపడుతున్న వారు, ఆయిల్‌ స్కిన్‌ ఉన్న వారికి స్టీమ్‌ బాగా ఉపయోగపడుతుంది. మూసుకుపోయి ఉన్న చర్మ రంధ్రాలు ఆవిరితో తెరుచుకుంటాయి.


ఏ స్కిన్‌ ఉన్న వారైనా ఆవిరి పట్టొచ్చు. ఎగ్జిమా, సొరియాసిస్‌, డెర్మటైటిస్‌ సమస్యలు ఉన్నవారు మాత్రం స్టీమింగ్‌కు దూరంగా ఉండాలి.


ఆవిరి ఆరు నిమిషాల కన్నా ఎక్కువ సమయం పట్టకూడదు. ఆవిరి పట్టిన తరువాత మెత్తటి పొడి టవల్‌తో తుడుచుకోవాలి. 


Advertisement

అందమే ఆనందంమరిన్ని...

Advertisement