చర్మం పట్టులా మెరవాలంటే...

ABN , First Publish Date - 2021-03-04T17:21:26+05:30 IST

మలాయి, బ్లూబెర్రీస్‌తో ఇంట్లో ఫేస్‌ ప్యాక్‌ చేసుకుని ముఖానికి రాసుకుంటే చర్మం పట్టులా మెరుస్తుంది. ఈ మాస్కు చర్మానికి కావాలసిన తేమను అందిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

చర్మం పట్టులా మెరవాలంటే...

ఆంధ్రజ్యోతి(04-03-2021)

మలాయి, బ్లూబెర్రీస్‌తో ఇంట్లో ఫేస్‌ ప్యాక్‌ చేసుకుని ముఖానికి రాసుకుంటే చర్మం పట్టులా మెరుస్తుంది. ఈ మాస్కు చర్మానికి కావాలసిన తేమను అందిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.  


ఫేస్‌ఫ్యాక్‌ తయారీకి కావలసినవి: రెండు లేదా మూడు బ్లూబెర్రీలు, ఒక టేబుల్‌స్పూను తాజా మలాయి, అర టేబుల్‌స్పూన్‌ ముల్తానిమట్టి. 


తయారీ: బ్లూబెర్రీలను మెత్తగా చేసి ఒక గిన్నెలో వేయాలి. ఆ బ్లూబెర్రీస్‌ మిశ్రమంలో మలాయి వేసి బాగా కలిపి మెత్తటి పేస్టులా చేయాలి. ఇందులో ముల్తానీమట్టిని కలపాలి. దీన్ని కలపడం వల్ల ఈ మిశ్రమం చిక్కగా తయారవుతుంది. 


ఇలా అప్లై చేయాలి

ముందుగా ఐదు నుంచి పది నిమిషాల దాకా ఆవిరిపట్టాలి. ఇలా చేయడం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుని అవి ఫేస్‌ మాస్కును లోపలికి  బాగా పీల్చుకుంటాయి. దీంతో చర్మం బాగా నిగారిస్తుంది.

ఆవిరి పట్టిన ముఖాన్ని పొడిగుడ్డతో అద్దుతూ తుడుచుకోవాలి. ఆ తర్వాత పొడిగా ఉన్న ముఖంపై ఫేస్‌మాస్కు పేస్టును అప్లై చేయాలి. చర్మంపై ఫేస్‌మాస్కు వేసుకున్న తర్వాత ఐదు నిమిషాలు ముఖంపై సున్నితంగా మసాజ్‌ చేయాలి. 

పదిహేను ఇరవై నిమిషాలపాటు అలాగే ఉంచుకుని ఆ తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. 

మలాయిలో ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. బ్లూబెర్రీస్‌లో యాంటాక్సిడెంట్లు బాగా ఉంటాయి.

మలాయిలో ఉన్న ఫ్యాట్స్‌ వల్ల చర్మం లోపలి నుంచీ శుభ్రమై చర్మం మెరుపును పొందుతుంది. ఇందులోని లాక్టిక్‌ యాసిడ్‌ చర్మంలోని మృతకణాలను పోగొట్టి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. 

బ్లూబెర్రీస్‌లోని యాంటాక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌ను కట్టడిచేస్తాయి. దీంతో చర్మంపై ముడతలు ఏర్పడవు. మొటిమల నివారణలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి.

Updated Date - 2021-03-04T17:21:26+05:30 IST