Abn logo
Dec 10 2020 @ 15:18PM

ముడతలు మాయం చేయండిలా!

ఆంధ్రజ్యోతి(10-12-2020)

ముఖం మీద గీతలు, ముడతలు వయసును చెప్పేస్తాయి. వీటిని పోగొట్టేందుకు ఇంటి వద్దనే తయారు చేసుకున్న క్యారెట్‌, సెనగపిండి, రోజ్‌వాటర్‌ ఫేస్‌ప్యాక్‌  చక్కగా పనిచేస్తుంది అంటున్నారు బ్యూటీ బ్లాగర్‌ వందనా గోస్వామి. 


ఒక గిన్నెలో కొద్దిగా క్యారెట్‌ తురుము, సగం టేబుల్‌ స్పూన్‌ సెనగపిండి, టేబుల్‌స్పూన్‌ రోజ్‌వాటర్‌ తీసుకోవాలి. వీటన్నింటిని బాగా కలిపి ముఖానికి ప్యాక్‌లా రాసుకోవాలి. పదినిమిషాల తరువాత నీళ్లతో కడుక్కోవాలి.


క్యారెట్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్‌ చర్మానికి పోషణనిచ్చి కాంతిమంతంగా మారుస్తాయి. ఈ ఫేస్‌ప్యాక్‌ వేసుకోవడం వల్ల తేమ అంది, చర్మం బిగుతుగా మారుతుంది. ముడతలు మాయమవుతాయి. 


Advertisement
Advertisement
Advertisement