Abn logo
Dec 2 2020 @ 10:33AM

ఫేస్‌సీరమ్‌తో చర్మం యవ్వనంగా

ఆంధ్రజ్యోతి(02-12-2020)

వయసు పెరుగుతున్న కొద్దీ ముఖంపై ముడతలు, గీతలు ఏర్పడి ముఖం కళ తప్పుతుంది. అలా జరగకుండా ఉండాలంటే రోజూ ఫేస్‌ సీరమ్‌ రాసుకోవాలి. అలాచేస్తే చర్మం కాంతిమంతంగా తయారవుతుంది.


సరిపోయేంత నిద్ర లేనప్పుడు ముఖం డల్‌గా, అలసిపోయినట్టు కనిపిస్తుంది. అప్పుడు ఫేస్‌ సీరమ్‌ (మాయిశ్చరైజర్‌ కన్నా తేలికగా ఉండే జెల్‌ లేదా లిక్విడ్‌)రాసుకుంటే ముఖం కాంతిమంతంగా మారుతుంది.

ఫేస్‌ సీరమ్‌ చర్మం లోపలి కణాల్లోకి వెళ్లి, చర్మానికి మృదుత్వాన్ని ఇస్తుంది. 

దీనిలోని రెటినాల్‌, కాపర్‌ పెప్టైడ్‌ ముఖం మీది ముడతలను తగ్గించి, చర్మాన్ని యవ్వనం ఉట్టిపడేలా మారుస్తాయి.

ఫేస్‌ సీరమ్‌ ప్రధాన ఉపయోగాల్లో ఒకటి చర్మాన్ని తేమగా ఉంచడం. దీనిలోని హయిలురోనిక్‌ యాసిడ్‌ చర్మానికి తేమను అందిస్తుంది. 


Advertisement
Advertisement
Advertisement