తప్పమ్మా.. అలా చేయకమ్మా.. అని భర్త చెప్పిన మాటలను కూడా ఆ భార్య లెక్కచేయలేదు.. చివరకు జరిగిన ఘోరమిది..!

ABN , First Publish Date - 2021-11-19T03:53:04+05:30 IST

వ్యసనం ఆపై మొండితనం ఉన్న మనిషి తనకు తానే శత్రవుగా మారుతాడు. తన వినాశనాన్ని తానే కోరితెచ్చుకుంటాడు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న ద్రిశ్య కూడా తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంది. ..

తప్పమ్మా.. అలా చేయకమ్మా.. అని భర్త చెప్పిన మాటలను కూడా ఆ భార్య లెక్కచేయలేదు.. చివరకు జరిగిన ఘోరమిది..!

వ్యసనం ఆపై మొండితనం ఉన్న మనిషి తనకు తానే శత్రవుగా మారుతాడు. తన వినాశనాన్ని తానే కోరితెచ్చుకుంటాడు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న ద్రిశ్య కూడా తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంది. 


కేరళ రాష్ట్రంలోని టీ తోటలకు నిలయమైన చిన్నార్ ప్రాంతానికి సమీపంలో ఎలప్పార గ్రామం ఉంది. ఆ గ్రామంలో నివసించే రాజేష్‌కు ద్రిశ్య అనే యువతితో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వారిద్దరికీ పిల్లల కూడా లేరు. రాజేష్, ద్రిశ్యతో పాటు రాజేష్ తండ్రి కూడా వారితో అదే ఇంట్లో ఉంటారు. నవంబర్ 15 సోమవారం మధ్యాహ్నం నుంచి ద్రిశ్య అనుకోకుండా కనబడడం లేదని రాజేష్, అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


పోలీసుల ద్రిశ్య మిస్సింగ్ కేసు విచారణ చేయడం మొదలుపెట్టారు. ఆ రోజు మధ్యాహ్నం 2.30 సమయం వరకు రాజేష్ తండ్రి, ద్రిశ్య ఇంట్లోనే ఉన్నారని తెలిసింది. రాజేష్ తండ్రి ఆ తరువాత పొరుగున ఉన్న ఇంట్లో తన స్నేహితుడికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో చూసేందుకు వెళ్లాడు. రాజేష్ కూడా ఇంట్లో లేకపోవడంతో ద్రిశ్య ఒంటరిగానే ఉంది. కానీ ఆ తరువాత ఏమైందో? ఎక్కడికి వెళ్లిందో ఎవరికీ తెలియదు.


మరుసటి రోజు రాజేష్ పోలీసులతో కలిసి ద్రిశ్య కోసం వెతకుతూ ఉండగా.. ఇంట్లోని టార్చ్ లైట్ వరండాలో కిందపడి ఉంది. దాని పక్కనే ఒక పాడు బడిన బావి ఉంది. అందులో చూడగా.. ద్రిశ్య శవం కనపడింది. ఆ శవం సగం కాలిపోయి ఉంది. పోలీసులు ద్రిశ్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. చనిపోయే ముందు ద్రిశ్య తనకు తాను నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుందని తెలిసింది. 


ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని పోలీసులు రాజేష్ కుటుంబంతోపాటు, ద్రిశ్య తల్లిదండ్రులను కూడా ప్రశ్నించారు. ద్రిశ్య చనిపోయేమందు ఏం జరిగిందో వారంతా అప్పుడు చెప్పారు. 


ద్రిశ్య ఎల్లప్పుడూ ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో కొత్త కొత్త వారితో పరిచయం చేసుకొనేది. అలా తెలియని వారితో స్నేహం మంచిది కాదని రాజేష్, అతని తండ్రి ఆమెకు ఎంత నచ్చజెప్పినా వినిపించుకునేది కాదు. ద్రిశ్య భర్తను, ఇంటిని నిర్లక్ష్యం చేసేదని, దీంతో వారిద్దరికీ గొడవలు మొదలయ్యాయి. ఫోన్ లేకుండా తాను ఉండలేనని, తనపై భర్త, మామల పెత్తనం ఏమిటని? ద్రిశ్య వారికి ఎదరుతిరిగింది. 


దీంతో ద్రిశ్య తల్లిదండ్రులను రాజేష్ తన ఇంటికి పిలిపించాడు. ఆమెకు ఫేస్‌బుక్ వ్యసనం మరీ ఎక్కువగా మారిందని.. తెలియని వారితో పరిచయం పెంచుకోవడం ఏమిటని? రాజేష్ తన అత్తమామలను ప్రశ్నించాడు. తల్లిదండ్రులు కూడా ద్రిశ్యని తన అలవాట్లను మార్చుకోవాలని హితబోధ చేశారు. అందరూ అలా ద్రిశ్యను దోషి గా చేసి మాట్లాడడం ఆమెకు నచ్చలేదు. ఇదంతా తనకు జరిగిన అవమానంగా ఆమె భావించింది. వారంగా వెళ్లిపోయాక ఆ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో తనకు తాను నిప్పింటిచుకొంది. మంటల వేడి తట్లుకోలేక ఇంటి పక్కన ఉన్న బావిలో ఆమె దూకేసింది. కానీ అందులో నీరు లేకపోవడం, పైగా ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ఆమె అందులోనే మరణించింది.


Updated Date - 2021-11-19T03:53:04+05:30 IST