పెంపుడు మేకల్ని పరిచయం చేసిన మార్క్ జూకర్‌బర్గ్

ABN , First Publish Date - 2021-05-11T22:08:53+05:30 IST

ఫేస్‌బుక్ అధినేత మార్క్ జూకర్‌బర్గ్ రెండు మేకల్ని పెంచుకుంటున్నారు. ఈ రెండు మేకల్ని ఫేస్‌బుక్ ద్వారా పరిచయం చేశారు. పెంపుడు జంతువుల్లో మేక ఒకటి. జూకర్‌బర్గ్ మేకను పెంచుకుంటే ఇందులో విశేషం ఏముంది

పెంపుడు మేకల్ని పరిచయం చేసిన మార్క్ జూకర్‌బర్గ్

ఇంటర్నెట్ డెస్క్: ఫేస్‌బుక్ అధినేత మార్క్ జూకర్‌బర్గ్ రెండు మేకల్ని పెంచుకుంటున్నారు. ఈ రెండు మేకల్ని ఫేస్‌బుక్ ద్వారా పరిచయం చేశారు. పెంపుడు జంతువుల్లో మేక ఒకటి. జూకర్‌బర్గ్ మేకను పెంచుకుంటే ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా? ఆ రెండు మేకల్లో ఒక మేకకు ‘బిట్ కాయిన్’ పేరు పెట్టడం చర్చనీయాశంగా మారింది. ఇక మరో మేకకు ‘మాక్స్’ అని పేరు పెట్టారు. జూకర్‌బర్గ్‌ మనసులో ఏమున్నప్పటికీ నెటిజెన్లు మాత్రం ఎలాన్ మస్క్‌ను గుర్తు చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. బిట్‌కాయిన్‌కు పోటీగా డాగీ కాయిన్ అనే క్రిప్టో కరెన్సీని  ఎలాన్ మస్క్ తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండింటినీ కలిసి తన పెంపుడు మేకలకు మాక్స్, బిట్ కాయిన్ అని పేరు పెట్టి ఉంటారని నెటిజెన్లు అంటున్నారు. ‘మస్క్-బిట్‌కాయిన్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Updated Date - 2021-05-11T22:08:53+05:30 IST