ఫేస్‌బుక్‌లో డాక్టర్‌తో పరిచయం.. రూ.11 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు

ABN , First Publish Date - 2021-08-06T00:20:20+05:30 IST

ఫేస్‌బుక్‌లో డాక్టర్‌తో పరిచయం.. రూ.11 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు

ఫేస్‌బుక్‌లో డాక్టర్‌తో పరిచయం..  రూ.11 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు

హైదరాబాద్: ఫారెస్ట్ ఆయిల్ పేరుతో డాక్టర్ నుంచి సైబర్ నేరగాళ్లు రూ.11 కోట్లు కొట్టేశారు. గీత నారాయణ్ పేరుతో డాక్టర్ మురళీమోహన్ రావుకు ఫేస్ బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి పరిచయం చేసుకున్నారు. అమెరికాలో ఖరీదైన ఆయిల్ బిజినెస్ చేస్తున్నామని డాక్టర్‌ను నమ్మించారు. వ్యాక్సిన్ తయారయ్యే ఆగ్రో సీడ్ ఆయిల్ సప్లయ్ చేస్తామని చెప్పారు. విడతల వారిగా అమెరికన్ డాలర్స్ రూపంలో రూ. 11 కోట్లు ఆన్‌లైన్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. ఆ తర్వాత ఫేస్ బుక్‌లో స్పందించ లేదు. మోసపోయాయని తెలుసుకున్న బాధితుడు డాక్టర్ మురళీమోహన్ రావు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-08-06T00:20:20+05:30 IST