డేటా దుర్వినియోగం.. ఫేస్‌బుక్‌కు 50 మిలియన్ యూరోల ఫైన్

ABN , First Publish Date - 2021-10-20T23:51:13+05:30 IST

ఫేస్‌బుక్‌పై ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయి. యూరప్‌లో 50 మిలియన్ల మంది డేటాను దుర్వినియోగం చేశారని అప్పట్లో అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో బ్రిటన్‌లోని ప్రముఖ వార్తా పత్రికల్లో ఫేస్‌బుక్ క్షమాపణలు కూడా తెలిపింది. అయితే డేటా దుర్వినియోగాన్ని మాత్రం ఫేస్‌బుక్ అంగీకరించలేదు..

డేటా దుర్వినియోగం.. ఫేస్‌బుక్‌కు 50 మిలియన్ యూరోల ఫైన్

లండన్: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు భారీగా జరిమానా పడింది. సమాచారాన్ని దుర్వినియోగం చేశారంటూ బ్రిటన్‌కు చెందిన కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అథారిటీ (సీఎంఏ) అనే సంస్థ ఫేస్‌బుక్‌కు 50 మిలియన్ యూరోల జరిమానా విధించింది. ఫేస్‌బుక్‌కి సంబంధించిన రోజూవారి సమాచారాన్ని అందించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ ఈ విషయాన్ని ఫేస్‌బుక్ పట్టించుకోలేదని, దీంతో వినియోగదారుల భద్రత గురించి అనేక ఆందోళనలు వెల్లడవుతున్నాయని సీఎంఏ పేర్కొంది.


ఫేస్‌బుక్‌పై ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయి. యూరప్‌లో 50 మిలియన్ల మంది డేటాను దుర్వినియోగం చేశారని అప్పట్లో అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో బ్రిటన్‌లోని ప్రముఖ వార్తా పత్రికల్లో ఫేస్‌బుక్ క్షమాపణలు కూడా తెలిపింది. అయితే డేటా దుర్వినియోగాన్ని మాత్రం ఫేస్‌బుక్ అంగీకరించలేదు. ఇక 2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఫేస్‌బుక్ ట్రంప్‌తో లోపాయికారి ఒప్పందం చేసుకుందనే ఆరోపణలు చాలా బలంగా ఉన్నాయి. ఇండియాలో కూడా 2014లో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని ఓ అంతర్జాతీయ మీడియా సంచలన కథనాన్ని వెలువరించింది.

Updated Date - 2021-10-20T23:51:13+05:30 IST