ఫేస్‌బుక్‌లో పరిచయం అయిన యువతికి కోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2021-10-17T08:08:18+05:30 IST

ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఫ్రెండ్‌ చేతిలో తిరుపతికి చెందిన ఓ యువతి మోసపోయారు. అలిపిరి సీఐ దేవేంద్రకుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం..

ఫేస్‌బుక్‌లో పరిచయం అయిన యువతికి కోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఏం చేశాడంటే..

తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 16: ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఫ్రెండ్‌ చేతిలో తిరుపతికి చెందిన ఓ యువతి మోసపోయింది. అలిపిరి సీఐ దేవేంద్రకుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. టీటీడీకి చెందిన ఓ ఇంజనీర్‌ కుమార్తెకు అనంతపురానికి చెందిన దీపాబాబు అనే వ్యక్తితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. నిత్యం ఆమెతో చాట్‌చేస్తూ వచ్చిన అతను అనంతపురం కోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. ఇందుకోసం కొంత ఖర్చు పెట్టాలంటూ.. విడతలవారీగా రూ.9.33 లక్షలతోపాటు 192 గ్రాముల బంగారు నగలు తీసుకున్నాడు. ఆ తర్వాత అతడి నుంచి ఎటువంటి స్పందన లేదు. పైగా ఫేస్‌బుక్‌లోనూ కనిపించకుండా పోయాడు. మోసం చేశాడని ఆలస్యంగా గుర్తించిన ఆ యువతి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. యువతి తండ్రి శనివారం అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 

Updated Date - 2021-10-17T08:08:18+05:30 IST