ట్రంప్ ఖాతాలపై నిషేధాన్ని ఎత్తివేసే ఆలోచన లేదు: ఫేస్‌బుక్

ABN , First Publish Date - 2021-01-13T04:53:46+05:30 IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ఫేస్‌బుక్ ఖాతాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసే ఆలోచన లేదని ఫేస్‌బుక్ సంస్థ

ట్రంప్ ఖాతాలపై నిషేధాన్ని ఎత్తివేసే ఆలోచన లేదు: ఫేస్‌బుక్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ఫేస్‌బుక్ ఖాతాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసే ఆలోచన లేదని ఫేస్‌బుక్ సంస్థ సీఓఓ షెరైల్ శాండ్‌బర్గ్ తాజాగా వెల్లడించారు. ట్రంప్ ఫేస్‌బుక్ ఖాతాలపై నిషేధం విధించడం పట్ల శాండ్‌బర్గ్ ఆనందం వ్యక్తం చేశారు. వాషింగ్టన్ డీసీలోని కేపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు గత బుధవారం దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ దాడి తరువాత ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలపై ఆయా సంస్థలు నిషేధం విధించాయి. అయితే ఈ ఖాతాలపై ఉన్న నిషేధాన్ని కొద్ది రోజుల్లేనే ఎత్తివేస్తారని అనుకునే సమయంలో ఫేస్‌బుక్ ఈ ప్రకటన చేసింది. మరోపక్క ట్విటర్ సంస్థ ట్రంప్ ఖాతాలను శాశ్వతంగా సస్పెండ్ చేసింది. ట్విటర్ నిర్ణయం వల్ల ఆ సంస్థ షేర్లు సోమవారం దాదాపు పది శాతం మేర పడిపోయాయి. దీని వల్ల ట్విటర్ మార్కెట్ వ్యాల్యూ 2.5 బిలియన్ డాలర్ల మేర తగ్గింది.

Updated Date - 2021-01-13T04:53:46+05:30 IST