ఫేస్‌బుక్‌ కొవిడ్‌ - 19 అనౌన్స్‌మెంట్‌ టూల్‌

ABN , First Publish Date - 2021-05-22T09:01:48+05:30 IST

ఫేస్‌బుక్‌ తన కొవిడ్‌ - 19 అనౌన్స్‌మెంట్‌ టూల్‌ని భారతదేశంలో మరింతగా విస్తరిస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఆరోగ్య విభాగాల అప్‌డేట్‌లను వినియోగదారులకు

ఫేస్‌బుక్‌ కొవిడ్‌ - 19 అనౌన్స్‌మెంట్‌ టూల్‌

ఫేస్‌బుక్‌ తన కొవిడ్‌ - 19 అనౌన్స్‌మెంట్‌ టూల్‌ని భారతదేశంలో మరింతగా విస్తరిస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఆరోగ్య విభాగాల అప్‌డేట్‌లను వినియోగదారులకు అందించేందుకు ఈ టూల్‌ని మరింత విస్తరింపజేస్తోంది. అమెరికా తరవాత భారత్‌లోనే ఈ టూల్‌ని ఫేస్‌బుక్‌ ఆరంభించింది.  దీని ద్వారా మన దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అందించే వ్యాక్సిన్‌ సమాచారాన్ని  తెలుసుకోవచ్చు. సంబంధిత వివిధ అలర్ట్‌లను అందుకోవచ్చు. 


హెల్ప్‌ లైన్లు సహా కొవిడ్‌ సంబంధిత సమాచారం, పడకలు అంటే జనరల్‌, ఐసీయూ, ఆక్సిజన్‌ బెడ్ల వివరాలు, అప్‌డేట్స్‌ను తెలుసుకోవచ్చు. కొవిడ్‌ నిబంధనలు అంటే వివిధ ప్రాంతాల్లో లాకౌట్‌, సడలింపు సమయాలు, ప్రతి రోజు తీసుకుంటున్న చర్యలు, ట్రీట్‌మెంట్‌ ప్రొటోకాల్‌లో మార్పుల సమాచారం ఉంటుంది. వ్యాక్సిన్‌ తీసుకునేందుకు అర్హతలు, రిజిస్ట్రేషన్‌, లాజిస్టిక్స్‌ విషయాలు ఉంటాయి. ప్రివెంటివ్‌ బిహేవియరల్‌ హెల్త్‌ మెజర్స్‌ సహా యావత్తు సమాచారానికి వేదికగా  ఈ టూల్‌ ఉపయోగపడుతుంది. 

Updated Date - 2021-05-22T09:01:48+05:30 IST