బైడెన్ ప్రమాణ స్వీకారం వేళ.. ఫేస్‌బుక్ కీలక నిర్ణయం!

ABN , First Publish Date - 2021-01-18T02:36:31+05:30 IST

అగ్రరాజ్య అధినేతగా బైడెన్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నా

బైడెన్ ప్రమాణ స్వీకారం వేళ.. ఫేస్‌బుక్ కీలక నిర్ణయం!

వాషింగ్టన్: అగ్రరాజ్య అధినేతగా బైడెన్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఫేస్‌బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయుధ ఉపకరణాలకు సంబంధించిన యాడ్‌లపై బ్యాన్ విధిస్తున్నట్టు ప్రకటించింది. ‘ఆయుధాలు, మందుగుండు సామాగ్రీ, తుపాలకు వాడే సైలెన్సర్లు తదితర వాటిపై ఇప్పటికే నిషేధం విధించాం. ఆయుధ ఉపకరణాలకు సంబంధించిన ప్రకటనలపై కూడా బ్యాన్ విధిస్తున్నాం’ అంటూ బ్లాగ్‌ పోస్ట్‌లో ఫేస్‌బుక్ తెలిపింది. బైడెన్ ప్రమాణ స్వీకారం వేళ అల్లర్లు చేసేందుకు ఆందోళనకారులు ప్రణాళికలు రచిస్తున్నట్టు తమకు సమాచారం అందిందని ఎఫ్‌బీఐ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫేస్‌బుక్ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా.. అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్.. ఈనెల 20న ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. 


Updated Date - 2021-01-18T02:36:31+05:30 IST