గురుకులంలో వసతులు కల్పించాలి

ABN , First Publish Date - 2022-07-11T06:26:29+05:30 IST

రాష్ట్రప్రభుత్వం గురుకులాలో నాణ్యమైన విద్యా, భోజన వసతి, కేజీ టూ పీజీ విద్య కోసం కోట్లాది నిధులు వెచ్చిస్తున్నా.. ఆచ రణలో మాత్రం అమలు కావడం లేదు. మండలకేంద్రంలోని మహాత్మా జ్వోతి బాపూలే బీసీ వెల్ఫే ర్‌ బాలుర గురుకులంలో కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నా.. సంబంధిత గరురుకులం సిబ్బంది చోద్యం చూస్తోందని ఆరోపిస్తూ ఆదివారం

గురుకులంలో వసతులు కల్పించాలి
ఇచ్చోడలో రాస్తారోకో చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు

ఇచ్చోడ, జూలై 10: రాష్ట్రప్రభుత్వం గురుకులాలో నాణ్యమైన విద్యా, భోజన వసతి, కేజీ టూ పీజీ విద్య కోసం కోట్లాది నిధులు వెచ్చిస్తున్నా.. ఆచ రణలో మాత్రం అమలు కావడం లేదు. మండలకేంద్రంలోని మహాత్మా జ్వోతి బాపూలే బీసీ వెల్ఫే ర్‌ బాలుర గురుకులంలో కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నా.. సంబంధిత గరురుకులం సిబ్బంది చోద్యం చూస్తోందని ఆరోపిస్తూ ఆదివారం విద్యార్ధుల తల్లిదండ్రులు గురు కులం ముందు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భం గా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. విద్యార్థులను చూడటానికి ఉమ్మడి జిల్లాల నుంచి ప్రతీ ఆదివారం వస్తుంటామని, అయితే విద్యార్థుల కు ఉడకని అన్నం పెడుతున్నారని, ప్రతీరోజు చింతపులుసు అందిస్తున్నారని మండిపడ్డారు. దీంతో వార్డెన్‌పై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుం డా గురుకుల భవనం పైఅంతస్తులో బాత్‌రూంలు, మూత్రశాలల గదులు పైన ఉండటంతో వారం రోజులుగా ఎడతెరిపి వర్షాలు కురుస్తుండటంతో మూత్రశాల అంతర్గత గోడలు, పైకప్పు నుంచి మురికినీరు విద్యార్థులు పడుకునే ప్రదేశంలో పడుతోందని మండిపడ్డారు. గురుకులంలోని మొత్తం 500 మందికి ఒకటే మరుగుదొడ్డి ఉందని, దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారని అన్నారు. విద్యార్థులను పట్టించుకునే వారు లేరని, ఎన్నో  సమస్యలున్నా.. సంబంధిత జిల్లా అధికారుల పర్యవేక్షణ కరువైందని అన్నా రు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై ఉదయ్‌కుమార్‌ అక్కడి చేరుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. గురుకులం వార్డెన్‌ కొంతమంది వి ద్యార్థుల తల్లిదండ్రుల సంతకాలు తీసుకోని విద్యార్థులను సొంత గ్రామాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడంతో శాంతించారు. కనీస వసతులు లేకుండా గురుకులం ఎలా నడిపిస్తారంటూ స్థానికులు సైతం మండిపడ్డారు.

Updated Date - 2022-07-11T06:26:29+05:30 IST