వ్యాక్సిన్‌ నిల్వకు ఏర్పాట్లు

ABN , First Publish Date - 2020-12-04T05:43:03+05:30 IST

కేంద్రం నుంచి రాష్ట్రానికి రానున్న కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను నిల్వ ఉంచేందుకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా కలెక్టర్‌ వీరపాండియన్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలోని ఇమ్యునైజేషన్‌ భవనాన్ని పరిశీలిం చారు.

వ్యాక్సిన్‌ నిల్వకు ఏర్పాట్లు
వివరాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌

  1. ఇమ్యునైజేషన్‌ భవనాన్ని పరిశీలించిన కలెక్టర్‌


కర్నూలు(హాస్పిటల్‌), డిసెంబరు 3: కేంద్రం నుంచి రాష్ట్రానికి రానున్న కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను నిల్వ ఉంచేందుకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా కలెక్టర్‌ వీరపాండియన్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలోని ఇమ్యునైజేషన్‌ భవనాన్ని పరిశీలిం చారు. గురువారం జేసీ రామసుందర్‌ రెడ్డి, డీఎంహెచ్‌వో డా.బి. రామగిడ్డయ్యతో కలిసి ఇమ్యునైజేషన్‌ భవనాన్ని పరిశీలించారు. వ్యాక్సిన్‌ను నిల్వ ఉంచే గదులకు కరెంటు సరఫరా నిరంతరం ఉండేలా చూసుకోవాలని, జనరేటర్‌లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో నిల్వ ఉన్న వ్యాక్సిన్‌ గదుల్లో ఐఎల్‌ఆర్‌లను పరిశీలించి కొత్తగా అవసరమైన ఐఎల్‌ఆర్‌లను, డీఫ్రిజ్‌లు తెప్పించు కోవాలన్నారు. అలాగే కర్నూలు జీజీహెచ్‌లోని పీపీ యూనిట్‌ కల్లూరు అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ను సందర్శించి కరోనా వ్యాక్సిన్‌ నిల్వ సామర్థ్యాన్ని పరిశీలించారు. అడిషనల్‌ డీఎంహెచ్‌వో డా.కె.వెంకట రమణ, డీఐవో డా.మహేశ్వర ప్రసాద్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-04T05:43:03+05:30 IST