బుమ్రా బౌలింగ్ ఎదుర్కోవాలని ఉంది: పాక్ బ్యాట్స్‌మెన్

ABN , First Publish Date - 2020-05-26T03:52:17+05:30 IST

భారత యువపేసర్ జస్ప్రీత్ బుమ్రా బంతులను ఎదుర్కోవడం తను ఆశగా ఎదురుచూస్తున్న ఛాలెంజ్ అని పాక్ బ్యాట్స్‌మెన్ షాన్ మసూద్ చెప్పాడు.

బుమ్రా బౌలింగ్ ఎదుర్కోవాలని ఉంది: పాక్ బ్యాట్స్‌మెన్

ఇస్లామాబాద్: భారత యువపేసర్ జస్ప్రీత్ బుమ్రా బంతులను ఎదుర్కోవడం తను ఆశగా ఎదురుచూస్తున్న ఛాలెంజ్ అని పాక్ బ్యాట్స్‌మెన్ షాన్ మసూద్ చెప్పాడు. ఓ ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న మసూద్.. తాను ఇంతవరకూ బుమ్రా బౌలింగ్ ఎదుర్కోలేదని, అయితే ఆ ఛాలెంజ్ ఫేస్ చేయడానికి ఆశగా ఎదురు చూస్తున్నానని వెల్లడించాడు. ఇప్పటి వరకు మసూద్ ఎదుర్కొన్నవారిలో టఫెస్ట్ బౌలర్ ఎవరని అడగ్గా.. ఆసీస్ పేసర్ ప్యాట్ కమిన్స్ పేరు చెప్పాడు. ఐసీసీ వన్దే ర్యాంకింగ్స్‌లో బుమ్రా రెండో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే.

Updated Date - 2020-05-26T03:52:17+05:30 IST