కరోనా నివారణలో విఫలం

ABN , First Publish Date - 2021-06-18T04:47:57+05:30 IST

కరోనా నివారణలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి అన్నారు.

కరోనా నివారణలో విఫలం
మంత్రాలయం తహసీల్దార్‌కు వినతి పత్రం ఇస్తున్న నాయకులు

  1. తెల్లకార్డు ఉన్నవారికి రూ. 10 వేలు ఆర్థిక సాయం చేయాలి
  2. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి


మంత్రాలయం, జూన్‌ 17: కరోనా నివారణలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం టీడీపీ రాష్ట్ర పిలుపు మేరకు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి తహసీల్దార్‌ చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కరోనా వ్యాక్సినేషన్‌ వేగవంతంగా చేపట్టాలని, ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలన్నారు. తెల్లరేషన్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రూ. 10 వేలు చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పన్నగ వెంకటేశ్‌, మల్లికార్జునరెడ్డి, నెక్కి వెంకటేశ్‌, ఏబు, నరసింహులు, పాండు, చిదానంద, రామాంజినేయులు పాల్గొన్నారు. 


కౌతాళం: కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని టీడీపీ సీనియర్‌ నాయకులు ఉలిగయ్య అన్నారు. ఈ సందర్భంగా గురువారం కౌతాళంలోని తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం తహసీల్దార్‌ చంద్రశేఖర్‌ వర్మకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ కరోనా కష్ట కాలంలో ఉపాధి కోల్పోయిన కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. చంద్రన్న బీమా ఉండి ఉంటే కరోనా మృతులకు రూ.10 లక్షలు ఆర్థిక సాయం అందేదని అన్నారు. ఇప్పుడు అది లేదు కాబట్టి ఈ ప్రభుత్వం కరోనా మృతులకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేయాలని డిమాండ్‌ చేశారు. హాస్పెటళ్లలో ఆక్సిజన్‌ అందక చనిపోయిన వారందరికీ రూ. 10 వేలు, వారిలో వా తెల్లరేషన్‌ కార్డుదారులందరికీ రూ.25 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేయాలని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసి బకాయిలను వెంటనే చెల్లించాలని అన్నారు. కేంద్రం 65 లక్షల కరోనా వ్యాక్సిన్‌ డోసులను రాష్ట్రానికి అందజేస్తే వైసీపీ అసమర్థ ప్రభుత్వం కేవలం 26 లక్షల డోసులు మాత్రమే వినియోగించడంతో మిగిలిన వృథా అయ్యాయని ఆవేదన వ్యక్త పరిచారు. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌లో పత్రికా విలేకర్లను కూడా చేర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాశీవిశ్వనాథ్‌, వెంకటపతిరాజు, కొట్రేశ్‌గౌడ్‌, రామలింగ, కురువ వీరేష్‌, మంజు, గోవింద్‌, రమేష్‌ గౌడ్‌, నీలకంఠరెడ్డి, రాజానంద్‌, రెహమాన్‌ తదితరులు పాల్గొన్నారు.


ఆదోని టౌన్‌: కరోనా సమయంలో కూడా విధుల నిర్వహణలో రాజీపడకుండా ఎంతో ధైర్యంగా తమ విధులను నిర్వహిస్తూ అసువులు బాసిన పత్రికా విలేఖరులు, ఇతర సిబ్బందిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని టీడీపీ మైనార్టీ నాయకుడు గడ్డాఫకృద్దీన్‌ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా తమ విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు రూ.50 లక్షలు ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు.

Updated Date - 2021-06-18T04:47:57+05:30 IST