మాస్క్‌ ధరించకపోతే జరిమానా తప్పదు

ABN , First Publish Date - 2022-01-18T05:02:30+05:30 IST

కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ మాస్కు తప్పని సరిగా ధరించాలని లేకపోతే జరిమానా తప్పదని సీఐ రమేష్‌బాబు హెచ్చరించారు.

మాస్క్‌ ధరించకపోతే జరిమానా తప్పదు
ప్రజలకు అవగాహన కల్పిస్తున్న సీఐ రమేష్‌బాబు

పోరుమామిళ్ల, జనవరి 17 : కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో  ప్రతి ఒక్కరూ మాస్కు తప్పని సరిగా ధరించాలని లేకపోతే  జరిమానా తప్పదని సీఐ రమేష్‌బాబు హెచ్చరించారు. సోమవారం ఆయన పోరుమామిళ్లలోని మహాత్మాగాంధీ సర్కిల్‌, ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ట్రాఫిక్‌ నిబంధనల ప్రజలకు  అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న సమయంలో వ్యా పారస్తులు ప్రజలు, తప్పనిసరిగా మాస్కు వాడాల న్నారు. మాస్కు లేని వారికి రూ.500 అపరాధ రుసుం వేస్తామన్నారు. వ్యాపార వర్గాల వారు మాస్క్‌లేకుండా ప్రజలను దుకాణాలలోకి అనుమతించవద్దన్నారు.

Updated Date - 2022-01-18T05:02:30+05:30 IST