కన్నుల పండువగా జాతర

ABN , First Publish Date - 2021-03-02T06:47:12+05:30 IST

రాష్ట్రంలో రెండో అతి పెద్ద జాతర లింగమంతుల స్వామి జాతరను రాష్ట్ర ప్రభుత్వం కన్నుల పండువగా నిర్వహిస్తోందని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ అన్నారు. సోమవారం లింగమంతుల స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

కన్నుల పండువగా జాతర
పెద్దగట్టులో ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, జగదీష్‌రెడ్డి

మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ 

సూర్యాపేట(కలెక్టరేట్‌), మార్చి 1: రాష్ట్రంలో రెండో అతి పెద్ద జాతర లింగమంతుల స్వామి జాతరను రాష్ట్ర ప్రభుత్వం కన్నుల పండువగా నిర్వహిస్తోందని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ అన్నారు. సోమవారం లింగమంతుల స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. జాతరకు సీఎం కేసీఆర్‌ రూ.2కోట్ల నిధులను కేటాయించి యాదవుల అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు. మంత్రి జగదీ్‌షరెడ్డి అహర్నిశలు కృషి చేసి జాతరను విజయవంతం చేస్తున్నారని కొనియాడారు. పారిశుధ్యాన్ని పాటిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవడం అభినందనీయమన్నారు. కాళేశ్వరం జలాలతో తాగునీరు అందిస్తున్న మంత్రి  జగదీ్‌షరెడ్డికి యాదవ సమాజం రుణపడి ఉంటుందన్నారు. పెద్ద గట్టును సీఎం కేసీఆర్‌ చాలా అభివృద్ధి చేశారన్నారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండేలా చూడాలని యాదవుల ఇలువేల్పు లింగమంతుల స్వామిని కోరుకున్నట్టు తెలిపారు.

యాదవులపై సీఎం కేసీఆర్‌కు ఎనలేని ప్రేమ : జగదీ్‌షరెడ్డి 

యాదవ సోదరులపై సీఎం కేసీఆర్‌కు ఎనలేని ప్రేమ ఉందని, జాతర విజయవంతంకు కోట్ల రూపాయలు మంజూరు చేశారని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. జాతర సందర్బంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాటు చేశామన్నారు. 24గంటల విద్యుత్‌, తాగునీరు, మరుగుదొడ్లు అందుబాటులో ఉంచామన్నారు. సీసీ కెమెరాలతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామని చెప్పారు. స్వామి వారి కరుణా కటాక్షాలతో తెలంగాణ అభివృద్ధి చెందుతోందన్నారు. కాళేశ్వరం జలాలతో సూర్యాపేట జిల్లా సస్యశ్యామలంగా ఉందన్నారు. రైతులు సంతోషంగా జాతరకు వస్తున్నారన్నారు.

Updated Date - 2021-03-02T06:47:12+05:30 IST