సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల మేళా

ABN , First Publish Date - 2021-03-17T06:47:47+05:30 IST

రసాయనిక వ్యవసాయం వలన జరిగే అనర్థాల నుండి బయటపడటానికి రసాయన రహిత సేద్యం వైపు రైతులు అడుగులు వేస్తున్నారు...

సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల మేళా

రసాయనిక వ్యవసాయం వలన జరిగే అనర్థాల నుండి బయటపడటానికి రసాయన రహిత సేద్యం వైపు రైతులు అడుగులు వేస్తున్నారు. ఈ ఆరోగ్యకర పరిణామానికి చేయూతగా ‘రైతునేస్తం ఫౌండేషన్‌’ ఆధ్వర్యంలో ప్రకృతి/ సేంద్రియ వ్యవసాయంపై ఇప్పటివరకు 300కు పైగా అవగాహనా సదస్సులు జరిగాయి. ఈ నేపథ్యంలో, రెండు తెలుగు రాష్ట్రాల సేంద్రియ రైతుల బలోపేతం కోసం ‘కర్షక సేవా కేంద్రం’, ‘రైతునేస్తం ఫౌండేషన్‌’ సంయుక్త నిర్వహణలో మార్చి 29, 30, 31 తేదీలలో హైదరాబాద్‌ రవీంద్రభారతి ఆడిటోరియం హాల్‌లో సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల మేళాతో పాటు, సేంద్రియ వ్యవసాయ అవగాహన సదస్సులు జరగబోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సేంద్రియ రైతులు, వినియోగదారులు, ఉత్పత్తిదారులు ఈ మేళాలో పాల్గొంటారు. 100 స్టాల్స్‌ ఏర్పాటుకాబోతున్న ఈ సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల మేళాలో రోజూ ఉ. 10 గంటల నుంచి సా. 5 గంటల వరకు ఉత్పత్తుల ప్రదర్శన–అమ్మకంతోపాటు సేంద్రియ రైతులు, శాస్త్రవేత్తలు, అధికారులచే సేంద్రియ వ్యవసాయం, మిద్దెతోటల పెంపకం, యంత్రపరికరాల వాడకం, ఉద్యాన పంటల సాగు, చిరుధాన్యాల సాగు తదితర అంశాలపై అవగాహన సదస్సులు ఉంటాయి. ఈ అవకాశాన్ని రైతులు, వినియోగదారులు, ఉత్పత్తిదారులు వినియోగించుకోవాలని కోరుతున్నాం. ప్రవేశం ఉచితం. మరిన్ని వివరాలకు 9849312629, 7093973999 నంబర్లలో సంప్రదించవచ్చు.

డా. యడ్లపల్లి వెంకటేశ్వరరావు, 

చైర్మన్‌–‘రైతునేస్తం ఫౌండేషన్‌’

Updated Date - 2021-03-17T06:47:47+05:30 IST