ఎమ్మెల్యే పేరుతో ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతా

ABN , First Publish Date - 2021-11-25T02:38:02+05:30 IST

సైబర్ క్రిమినల్స్ ఈ సారి ఏకంగా ఎమ్మెల్యే పేరుతోనే టోకరా

ఎమ్మెల్యే పేరుతో ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతా

హైదరాబాద్‌: సైబర్ క్రిమినల్స్ ఈ సారి ఏకంగా ఎమ్మెల్యే పేరుతోనే టోకరా వేసే ప్రయత్నం చేశారు. నగరంలో్ని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేరుతో సైబర్ క్రిమినల్స్ ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతా తెరిచారు. ఫ్రెండ్ రిక్వెస్ట్‌లతో పాటు డబ్బులు పంపించాలని వినతులు పంపిస్తున్నారు. ఈ విషయమై పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన పేరు మీద రిక్వెస్ట్ వస్తే ఎవరూ కూడా డబ్బులు పంపించవద్దని కోరారు.  



Updated Date - 2021-11-25T02:38:02+05:30 IST