నకిలీకి కళ్లెం!

ABN , First Publish Date - 2021-06-22T05:32:13+05:30 IST

నకిలీకి కళ్లెం!

నకిలీకి కళ్లెం!
తాండూరు: నకిలీ విత్తనాలు అమ్మిన నిందితులను, విత్తనాలను చూపుతున్న రూరల్‌ సీఐ జలంధర్‌రెడ్డి

  • వికారాబాద్‌లో నకిలీ విత్తనాల పట్టివేత 

తాండూరు రూరల్‌/కొడంగల్‌: నకిలీ విత్తనాల అమ్మకాలకు అధి కారులు కళ్లెం వేస్తున్నారు. ఇతర పాంత్రాల నుంచి వికారాబాద్‌ జిల్లాకు తరలించి విక్రయిస్తున్న వ్యాపారులను పట్టుకుని కట్టడి చేస్తున్నారు. నకి లీ విత్తనాలమ్మిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని తాండూరు రూరల్‌ సీఐ జలంధర్‌రెడ్డి తెలిపారు. సోమవారం కరన్‌కోట్‌ పోలీసుస్టేషన్‌లో నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్న సంఘటనపై విలేకరులకు ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 20 న తాము వ్యవసాయాధికారులతో కలిసి పర్వతాపూర్‌లో తనిఖీలు చేశా మన్నారు. గుడాటి శ్రీనివా్‌సరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో 8కిలోల నకిలీ పత్తి వి త్తనాలు లభించాయన్నారు. అతడు  వాటిని తాండూరుకు చెందిన మి ర్యాణం  నరే్‌షకుమార్‌ వద్ద నుంచి తెచ్చాడని విచారణలో తేలిందన్నారు. నరే్‌షకుమార్‌ను విచారించగా, అతడు యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్‌ సమీప సాయిరాం సీడ్స్‌అండ్‌ఫర్టిలైజర్స్‌ యజమాని గంజపల్లి శ్రీనివాస్‌ నుంచి తెచ్చినట్టు చెప్పాడన్నారు. వ్యవసాయాధికారి స మక్షంలో పంచనామా నిర్వహించి ఇద్దరి వద్ద 26కిలోల నకిలీ విత్తనా లు, ఒక వెయింగ్‌ మిషన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. గంజిపల్లి శ్రీనివాస్‌ ఇప్పటికే రిమాండ్‌లో ఉన్నాడని తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐ ఏడుకొ ండలు ఉన్నారు. గ్రామాల్లోకి వచ్చి ఎవరైనా విత్తనాలు అమ్మితే అమ్మితే రైతులు కొనవద్దని సీఐ సూచించారు. తాండూరు నియోజకవర్గంలోని యాలా, బషీరాబాద్‌, పెద్దేముల్‌, తాండూరు రూరల్‌ పోలీసు స్టేషన్లలో ఇప్పటి వరకు నాలుగు నకిలీ విత్తనాల కేసులు నమోదయ్యాయని, వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.

ఇదిలా ఉంటే కొడంగల్‌ మండలంలోనూ నకిలీ విత్తనాలను పోలీసు లు పట్టుకున్నారు. సోమవారం సీఐ అప్పయ్య, దౌల్తాబాద్‌ ఎస్సై విశ్వజాన్‌ నకిలీ విత్తనాలపై వివరించారు. ఈ నెల 18న అన్నారంలో నాగేంద్రమ్మ అనే మహిళ నకిలీ పత్తి విత్తనాలు నిల్వ ఉంచినట్లు గుర్తించి ప ట్టుకున్నట్లు చెప్పారు. విత్తనాల సరఫరాపై పోలీసులు ఆరా తీయగా కర్ణాటక రాష్ట్రం గుర్మిట్‌కాల్‌లోని ధనలక్ష్మి ఫర్టిలైజర్స్‌ యజమాని హరికృష్ణ దగ్గర కొన్నట్టు తేలిందన్నారు. కొడంగల్‌ మీదుగా గుర్మిట్‌కాల్‌కు హ రికృష్ణ వెళ్తుండగా పోలీసులు పట్టుకుని విచారించారు. నియోజకవర్గంలోని రావుల్‌పల్లి, దౌల్తాబాద్‌ మండల పలు గ్రామాల్లో  సంవత్సరం నుంచి పల్లవి సీడ్స్‌, ప్రీమియం, హైబ్రీడ్‌ కాటన్‌ సీడ్స్‌, వీజీ-2 తదితర పేర్లతో విక్రయించినట్లు తెలిపాడు. హరిక్రిష్ణ నుంచి 4క్వింటాళ్లకుపైగా నకిలీ లూజ్‌ పత్తి విత్తనాలు, ప్యాకింగ్‌ కవర్లను స్వాధీనం చేసుకొని సోమవారం రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వివరించారు.

Updated Date - 2021-06-22T05:32:13+05:30 IST