Advertisement
Advertisement
Abn logo
Advertisement
Dec 9 2021 @ 10:27AM

నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ముఠా అరెస్టు

వేలూరు(చెన్నై): ఆంబూరు పోలీసులు మంగళవారం సాయంత్రం మాధనూరు ప్రాంతంలో వాహన తనిఖీలు చేపట్టి నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ఆరుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.2 వేలు, రూ.500 నోట్ల కట్టలు, 8 సెల్‌ఫోన్లు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల సమయంలో ఆగకుండా వెళ్లిని రెండు కార్లను వెంటాడిన పోలీసులు మాధనూరు ఎంఎం నగర్‌, బెడుగత్తూర్‌ ప్రాంతాల్లో అడ్డుకున్నారు. కార్లలోని వారిని విచారించగా వారు తిరువణ్ణామలై జిల్లా పెయ్యూర్‌కు చెందిన పెరుమాళ్‌, ఇరుంబులికి చెందిన సతీష్‌కుమార్‌, వేలూరు సలవన్‌ పేటకు చెందిన శ్రీనివాసన్‌, పొయిగై సురేష్‌, దినకరన్‌, చిన్నతోటాలంకు చెందిన శరత్‌కుమార్‌గా తెలిసింది.

Advertisement
Advertisement