నకిలీ డాక్టర్.. కొవిడ్ వైద్యం
ABN , First Publish Date - 2021-05-14T08:18:44+05:30 IST
ప్రకాశం జిల్లా ఒంగోలులోని సుందరయ్య భవన్రోడ్డులో ఆదిత్య జనరల్ హాస్పటల్లో అనధికారికంగా కొవిడ్ వైద్యం అందిస్తూ.. రోగుల వద్ద నుంచి అధికమొత్తంలో బిల్లులు వసూలు చేస్తున్నారు
ఒంగోలులో బోగస్ ఆస్పత్రి గుట్టురట్టు
ఒంగోలు (క్రైం), మే 13: ప్రకాశం జిల్లా ఒంగోలులోని సుందరయ్య భవన్రోడ్డులో ఆదిత్య జనరల్ హాస్పటల్లో అనధికారికంగా కొవిడ్ వైద్యం అందిస్తూ.. రోగుల వద్ద నుంచి అధికమొత్తంలో బిల్లులు వసూలు చేస్తున్నారు. దీంతోపాటు రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు బ్లాక్లో విక్రయిస్తున్నారు. బీఫార్మసీ చదువుకున్న ఆవుల శ్రీనివాసరెడ్డి ఈ ఆస్పత్రి నిర్వహణ బాధ్యతలు చూస్తున్నాడు. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జిల్లాలో పలు ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదిత్య జనరల్ హాస్పటల్లో అక్రమాలపై సమాచారం అందడంతో ఎన్ఫోర్స్మెంట్ అధికారి కేఎ్సఎ్సవీ సుబ్బారెడ్డి పర్యవేక్షణలో జిల్లాస్థాయి ప్లయింగ్ స్క్వాడ్ ఆకస్మికంగా దాడులు నిర్వహించింది. శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.