Abn logo
Apr 21 2021 @ 01:21AM

ఏసీబీ డీఎస్పీలమంటూ డబ్బు వసూళ్లు

 బందరులో ఇద్దరి అరెస్టు

మంగలి శ్రీను పాత నేరస్తుడే  

 మచిలీపట్నం టౌన్‌, ఏప్రిల్‌ 20 : ఏసీబీ డీఎస్పీలమంటూ  మోసాలకు పాల్పడిన ఇద్దరిని   పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. 20 ఏళ్ల నేరచరిత్ర కలిగి 200లకు పైగా నేరాలకు పాల్పడిన మంగలి శ్రీనును అరెస్టు చేసి రూ.98,500 స్వాధీనం చేసుకున్నారు.  ఏఎస్పీ మల్లికా గార్గ్‌, డీఎస్పీ రమేష్‌రెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో నిందితులు మంగలి శ్రీను, ఎన్‌.జయకృష్ణలను మీడియాకు చూపించారు. ఏసీబీ వలలో చిక్కిన పెడన పంచాయతీ రాజ్‌ ఏఈకి ఏసీబీ డీఎస్పీనంటూ మంగలి శ్రీను ఫోను చేసి లక్ష రూపాయలు డిమాండ్‌  బ్యాంకు ఖాతాలో వేయించున్నాడు. నిందితులిద్దరూ ఆండ్రాయిడ్‌ ఫోనులు వాడకుండా కీ ప్యాడ్‌ ఫోనులు వాడతా రన్నారు.  మాట్లాడి ఇస్తానంటూ వ్యాపారుల వద్ద ఫోన్‌ తీసుకుని ఈ విధమైన నేరాలకు పాల్పడ్డారన్నారు.  రూరల్‌ సీఐ కొండయ్య, పెడన ఎస్సైతో కలసి అనంతపురం లో ఉన్న మంగలి శ్రీను కోసం గాలింపు చర్యలు చేప ట్టారన్నారు.  మంగళవారం మచిలీపట్నం మూడు స్తంభాల సెంటరో నిందితు లిద్దరినీ అరెస్టు చేశారన్నారు.  డీఎస్పీ రమేష్‌ రెడ్డి మాట్లాడుదూ, అనంతపురం జిల్లా వజ్రక రూర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో తహసీల్దార్‌ నుంచి నిందితుడు రూ.10 వేలు డిమాండ్‌ చేశాడన్నారు. పెడన మునిసిపల్‌ కమిషనర్‌ను కూడా బెదిరించి డబ్బు డిమాండ్‌ చేశారన్నారు. కేసును ఛేదించిన పోలీసులకు రివార్డులు ఇస్తామన్నారు.  రూరల్‌ సీఐ కొండయ్య,  పెడన పోలీసులు  పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement