Advertisement
Advertisement
Abn logo
Advertisement

తల్లి ఆనందం కోసం.. నకిలీ పోలీస్ అవతారం

విజయవాడ: తల్లి కళ్లల్లో ఆనందం చూడాలనుకున్నాడు... పోలీస్ యూనిఫాం ధరించాడు... ఆపై కటకటాలపాలయ్యాడు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరుకు చెందిన పృధ్వీరాజ్ అనే యువకుడు పోలీస్ ఉద్యోగానికి విశ్వప్రయత్నం చేశాడు. అయినా ఉద్యోగం రాలేదు. అయితే తల్లిని సంతోషపెట్టడానికి తాను కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యానని నమ్మబలికాడు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ప్రైవేటు ఉద్యోగంలో చేరిన పృధ్వీ.. ఇంటికి మాత్రం పోలీస్ యూనిఫాంలో వెళ్లేవాడు. విజయవాడ శివారు ప్రాంతం నున్నలో పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తున్న క్రమంలో పోలీసులకు పృధ్వీరాజ్ తారసపడ్డాడు. అనుమానస్పదంగా కనిపించడంతో పోలీసులు ఆరా తీశారు. దీంతో నకిలీ పోలీస్ అవతారం బయటపడింది. యువకుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. తల్లి కళ్లల్లో ఆనందం చూడడానికి పృధ్వీరాజ్ వేసిన యూనిఫాం అతడిని కటకటాలవెనక్కి నెట్టింది.

Advertisement
Advertisement