నకిలీ విత్తనాలమ్మితే క్రిమినల్‌ కేసు

ABN , First Publish Date - 2021-06-22T05:26:02+05:30 IST

నకిలీ విత్తనాలమ్మితే క్రిమినల్‌ కేసు

నకిలీ విత్తనాలమ్మితే క్రిమినల్‌ కేసు

చేవెళ్ల: నిబంధలు పాటించకుండా అధిక ధరలకు ఎరువులు, విత్తనా లమ్మితే చర్యలు తీసుకుంటామని చేవెళ్ల ఏడీఏ రమాదేవి స్పష్టం చేశారు. సోమవారం వ్యవసాయ అధికారులు మండల కేంద్రంలోని ఫర్టిలై జర్‌ దు కాణలను తనిఖీ చేశారు. దుకాణల్లోని మందులు, ఎరువుల స్టాక్‌ వివరాల రికార్డులను పరిశీలించారు. ఏడీఏ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని పర్టిలేజర్‌ దుకాణలను తనిఖి చేయడం జరుగుతుందన్నారు. ప్రతి షాపు ఎదుట క్రయవిక్రయాలు, ధరల బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. అమ్మకాలు జరిపిన ప్రతీ బిల్లుపై సంతకం తీసుకొని బిల్లును ఇవ్వాలని సూచించారు. కల్తీ విత్తనాలు, అనుమతి లేని విత్తనాలు, మందులు  అమ్మితే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తనిఖీల్లో చేవెళ్ల ఏవో కృష్ణమోహన్‌, టెక్నికల్‌ అధికారి పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T05:26:02+05:30 IST