ఫేక్‌బస్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ మోసాలకు చెక్‌

ABN , First Publish Date - 2021-05-22T09:10:23+05:30 IST

కొవిడ్‌ సంక్షోభంతో వర్చ్యువల్‌ సమావేశాల జోరు పెరిగింది. అయితే ఇదే అదునుగా మోసాలకూ తెరలేచింది. ఒకరికి బదులు మరొకరు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మోసాలను అరికట్టేందుకు పంజాబ్‌లోని ‘ఐఐటీ రోపార్‌’ ‘ఫేక్‌బస్టర్‌’ పేరిట ఒక టూల్‌ను కనుగొంది.

ఫేక్‌బస్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ మోసాలకు చెక్‌

కొవిడ్‌ సంక్షోభంతో వర్చ్యువల్‌ సమావేశాల జోరు పెరిగింది. అయితే ఇదే అదునుగా మోసాలకూ తెరలేచింది. ఒకరికి బదులు మరొకరు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మోసాలను అరికట్టేందుకు పంజాబ్‌లోని ‘ఐఐటీ రోపార్‌’ ‘ఫేక్‌బస్టర్‌’ పేరిట ఒక టూల్‌ను కనుగొంది.     

ఆస్ట్రేలియాలోని ‘మోనాష్‌’ యూనివర్సిటీతో కలిసి ఈ టూల్‌ని అభివృద్ధిపర్చింది. మార్ఫింగ్‌ ఇమేజ్‌తో వర్చ్యువల్‌ సమావేశాలు, వెబినార్‌లలో పాల్గొనే మోసగాళ్ళను ఈ టూల్‌ పట్టేస్తుంది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సహకారంతోనే తప్పుదారి పట్టిస్తుండటంతో భద్రతపరంగానూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

మొత్తానికి ఇప్పుడు కనుగొన్న టూల్‌ 90 శాతం ఆక్యురసీతో పనిచేస్తుందని పరిశోధకుల బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్‌ అభినవ్‌ దాల్‌ వెల్లడించారు. గత నెలలో అమెరికాలో జరిగిన ఒక సమావేశంలో దీనిపై పరిశోధన పత్రాన్ని సైతం సమర్పించారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ మోడ్‌ల్లో ‘ఫేక్‌బస్టర్‌’ పని చేస్తుంది. లైవ్‌ వీడియో కాన్ఫరెన్సింగ్‌లో మోసగాళ్ళను కనిపెట్టే ఈ టూల్‌ని మొబైల్‌ ఫోన్లు, డివైజెస్‌లలో పనిచేసేవిధంగా తీర్చిదిద్దుతున్నారు.

Updated Date - 2021-05-22T09:10:23+05:30 IST