మిరప దిగుబడి పతనం

ABN , First Publish Date - 2022-01-29T05:58:41+05:30 IST

మిరప రైతులకు కన్నీళ్లే మిగిలాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, తెగుళ్లు పంట దిగుబడిని దెబ్బతీశాయి.

మిరప దిగుబడి పతనం
పొలాల్లో రాసిగా పోసిన ఎండు మిరప

ఎకరాకు మూడు క్వింటాళ్లే..!  -  నష్టాలతో రైతు కన్నీళ్లు 


ఉరవకొండ, జనవరి 28: మిరప రైతులకు కన్నీళ్లే మిగిలాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, తెగుళ్లు పంట దిగుబడిని దెబ్బతీశాయి. నియోజకవర్గంలోని ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు మండలాల్లో హెచ్చెల్సీ, జీబీసీ, హెచఎనఎ్‌సఎ్‌స కాలువల కింద 30 వేల హెక్టార్లలో మిర్చి పంట సాగు చేశారు. డబ్బీ, కడ్డీ, 5531, 273 మిర్చి రకాలు ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యా యి. నల్ల తామర పురుగు తెగులు వెంటాడి 85 శాతం పైగా పంట దెబ్బతిని, దిగుబడులపై ప్రభావం చూపింది. సాధారణంగా ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళ్ల వరకు మిరప దిగుబడి వచ్చే అవకాశముంది. ప్రస్తుతం రెండు నుం చి మూడు క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

          

   పంట సాగుకు ఎకరాకు రూ.1.30 లక్షల దాకా పెట్టుబడి పెట్టామని రైతులు చెబుతున్నారు. మార్కెట్‌లో నాణ్యమైన సీడ్‌ రకం ఎండుమిరప క్వింటాల్‌ రూ.14 వేల నుంచి రూ.16 వేల దాకా ధర పలుకుతోంది. డ బ్బీ రకం క్వింటా రూ.30 వేల దాకా పలుకుతోంది. ఎకరాకు 3 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా, ప్రస్తుత ధరల ప్రకారం రూ.50 వేల దాకా నష్టం వస్తుందని రై తులు ఆవేదన వ్యక్తంచేశారు. 


పెట్టుబడి కూడా రావడం లేదు..

-భీమప్ప, రైతు, రాయంపల్లి 

ఐదు ఎకరాల్లో బ్యాడిగి, 273 రకం మిర్చి పంట సాగు చేశా. ఎకరాకు రూ.1.20 లక్షల దాకా పెట్టుబడి పెట్టా. రెండు, మూడు క్వింటాళ్లు దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈఏడు మిరప సాగుకు పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదు.


ప్రభుత్వం ఆదుకోవాలి..

  -చిన్న ఎర్రిస్వామి, రైతు, రాయంపల్లి

ఎనిమిది ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశా. ఎకరాకు 3 క్వింటా ళ్లు కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతం మార్కెట్లో ఎండుమిరప క్వింటా రూ.16 వేల వరకు కొంటున్నారు. ఎకరాకు రూ.50వేల వరకు నష్టం వస్తోంది. ప్రభుత్వమే ఆదుకోవాలి.  


Updated Date - 2022-01-29T05:58:41+05:30 IST