పోలీసు కార్యాలయంలో సొమ్మసిల్లిన బాధితురాలు

ABN , First Publish Date - 2021-08-03T13:44:23+05:30 IST

పోలీసు కార్యాలయంలో..

పోలీసు కార్యాలయంలో సొమ్మసిల్లిన బాధితురాలు

తన కుమారుడిది ఆత్మహత్య కాదని ఫిర్యాదు


గుంటూరు: పోలీసు కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ బాధితురాలు సొమ్మసిల్లిపడిపోవటం కలకలం రేపింది. నరసరావుపేటకు చెందిన పద్మావతి, ఆమె కుమారుడు కార్తీక్‌ రూరల్‌ ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఫిర్యాదు చేసే క్రమంలో తల్లి పద్మావతి కళ్లు తిరిగి పడిపోయారు. స్పందించిన సిబ్బంది ఆమెకు ప్రాథమిక చికిత్స అనంతరం ఎస్పీ వద్దకు తీసుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు తన కుమారుడు కల్యాణ్‌రాజాకు, నగరంలోని 14 అడ్డరోడ్డు, పెట్రోలు బంకు సమీపంలోని గాజులవారివీధికి చెందిన నాగమల్లేశ్వరితో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగిందన్నారు. వారికి కూతురు, కుమారుడు ఉన్నారని, తన కుమారుడు ఎలక్ర్టీషియన్‌గా పని చేస్తుంటాడని బాధితురాలు చెప్పారు. అయితే తన కోడలు అనేక మందితో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తూ భర్తను వేధింపులకు గురి చేసిందన్నారు. ఈ క్రమంలో గత నెల 16న తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఫోను చేసి చెప్పారని, తాము వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు చెప్పారన్నారు. అయితే తన కుమారుడిది ఆత్మహత్యకాదని, తన కోడలే ఆస్థి కోసం వేరే వారితో కలిసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసిందన్నారు. అయితే పోలీసులు ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలు వాపోయారు. 

Updated Date - 2021-08-03T13:44:23+05:30 IST