Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇంటర్నెట్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ టైమ్‌పాస్ చేసే కుర్రాడు.. ఓ యువతితో ప్రేమయాణం.. చివరకు కథ అడ్డం తిరిగిందిలా..!

నేటి యువత ఖాళీ సమయం దొరికితే ఇంటర్నెట్‌లో సమయం గడిపేస్తుంటారు. ఇంకొందరైతే రానురాను అశ్లీల వీడియోలకు బానిసలవుతుంటారు. ఈ క్రమంలో చివరకు దారుణాలు చేయడమో.. లేదా దారుణంగా మోసపోవడమో జరుగుతూ ఉంటుంది. ఇలాగే  ఓ వ్యక్తి.. అశ్లీల వీడియోలు చూసే క్రమంలో ఆన్‌లైన్‌లో ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. అనంతరం వారి పరిచయం.. ప్రేమగా మారింది. చివరకు ఆమె కోసం ఏం చేయడానికైనా సిద్ధపడ్డాడు. ఇక అక్కడి నుంచి అతని పతనం ప్రారంభమైంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

గుజరాత్‌లోని అహ్మ‌దాబాద్‌కు చెందిన తుషార్ సెజ్‌పాల్‌ అనే వ్యక్తి.. ఇర్ఫాన్ షేక్ చెందిన సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో సెజ్‌పాల్.. అశ్లీల వీడియోలకు బానిసయ్యాడు. అలాంటి సినిమాలు చూసేందుకు భారీ మొత్తంలో ఖర్చు చేసేవాడు. ఇందుకోసం సంస్థకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు వాడేవాడు. ఇలా దాదాపు రూ.16లక్షల వరకు వాడుకున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఆన్‌లైన్‌లో ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఇతడి బలహీనతను ఎలాగైనా క్యాష్ చేసుకోవాలని ఆ మహిళ ఎత్తుగడ వేసింది. ఏవేవో కారణాలు చెబుతూ పలుమార్లు అతడి నుంచి డబ్బులు రాబట్టింది.

ఆమె ఎంత డబ్బులు అడిగినా సెజ్‌పాల్.. ఇస్తూ వచ్చాడు. ఇలా అతనికి తెలీకుండానే సుమారు రూ.85లక్షల సంస్థ సొమ్మును.. ప్రియురాలి ఖాతాకు మళ్లించాడు. ఆఖరికి తన యజమాని ఇర్ఫాన్ కొనుగోలు చేసిన ఇంటి ఈఎంఐల‌ను కూడా చెల్లించ‌కుండా.. ఆ మొత్తాన్ని కూడా ప్రియురాలికే ఇచ్చేశాడు. అనుమానం వచ్చిన సంస్థ యజమాని.. బ్యాంక్ అకౌంట్ చెక్ చేయగా విషయం బయటపడింది. దీంతో సెజ్‌పాల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. సెజ్‌పాల్, మహిళ సహా ఏడుగురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి నిందితుడితో పాటు మ‌రో ఇద్ద‌రిని అరెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement