మంత్రి ‘కొప్పుల’పై అసత్య ఆరోపణలు సరికాదు

ABN , First Publish Date - 2021-05-10T05:47:57+05:30 IST

సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ బినామీల పేరుతో భూమి కబ్జా చే శారని ఆరోపణలు చేయడం సరైంది కాదని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు జనగామ గ్రామస్థులు, కార్పొరేటర్లు దాతు శ్రీనివాస్‌, కవిత సరో జి చెప్పారు.

మంత్రి ‘కొప్పుల’పై అసత్య ఆరోపణలు సరికాదు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న జనగామ గ్రామస్థులు

- విలేకరుల సమావేశంలో జనగామ గ్రామస్థులు

గోదావరిఖని, మే 9: సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ బినామీల పేరుతో భూమి కబ్జా చే శారని ఆరోపణలు చేయడం సరైంది కాదని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు జనగామ గ్రామస్థులు, కార్పొరేటర్లు దాతు శ్రీనివాస్‌, కవిత సరో జి చెప్పారు. ఆదివారం గ్రామకచీర్‌ వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జ నగామ గ్రామశివారులో మంత్రి భూమి కొనుగో లు చేశాడే తప్ప ఎవరిదగ్గర నుంచి కబ్జా చేయ లేదని, అందుగుల శ్రీనివాస్‌ అనే వ్యక్తి తనకు ఉన్న భూమిని అమ్ముకోగా కొంత భూమి రాజీవ్‌ రహదారి నిర్మాణం కింద పోయిందన్నారు. శ్రీని వాస్‌ అనే వ్యక్తికి అక్కడ భూమిలేదని, మంత్రి భూమికోసం రోడ్డువేశారనేది అవాస్తవమన్నారు. రాజీవ్‌రహదారి నుంచి జనగామకు రోడ్డు వే యాలని చాలాసార్లు ప్రజాప్రతినిధుల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, రామగుండం ఎమ్మెల్యే కో రుకంటి చందర్‌ డీఎంఎఫ్‌టీ నిధుల కింద ఈ రోడ్డును మంజూరు చేశారన్నారు. ఈ రోడ్డు గ్రామస్థుల గోదావరి సమీపంలో జరిగే స మ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లడానికి ఉపయోగపడుతుందన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదు రుచూస్తున్న రోడ్డుకు ఇప్పుడు మోక్షం వచ్చింద ని, కానీ కొంతమంది మంత్రి కోసమే రోడ్డు వేశారని అసత్య ఆరోపణలు చేస్తున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు, ఈ అంశం కోర్టులో ఉందని, కోర్టే తీర్పునిస్తుందన్నారు. విలేకరుల సమావేశంలో జనగామ గ్రామస్థులు రుద్రభట్ల వామన్‌రావు, మల్లేషం, హనుమంతరావు, అర్కుటి శంకర్‌, తోకల రమేష్‌, దొరగండ్ల మల్లయ్య, కలవేని రవీందర్‌, బండారి రవీందర్‌, ఊదరి రవి, దుర్గం భూమయ్య, నరేందర్‌రావు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-10T05:47:57+05:30 IST