నిరుద్యోగులను మోసం చేసేందుకే తప్పుడు ప్రకటన

ABN , First Publish Date - 2021-06-19T05:19:56+05:30 IST

రాష్ట్రంలో నిరుద్యోగులను మోసం చేసేందుకే ప్రభుత్వం తప్పుడు లెక్కలతో ప్రకటనలిస్తోందని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు తప్పుబట్టారు.

నిరుద్యోగులను మోసం  చేసేందుకే తప్పుడు ప్రకటన
మీడియాతో మాట్లాడుతున్న శ్రీరామ్‌చినబాబు

తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు


మదనపల్లె టౌన్‌, జూన్‌ 18: రాష్ట్రంలో నిరుద్యోగులను మోసం చేసేందుకే ప్రభుత్వం తప్పుడు లెక్కలతో ప్రకటనలిస్తోందని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు తప్పుబట్టారు. శుక్రవారం నీరుగట్టువారిపల్లెలో తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... దేశ చరిత్రలో రికార్డు సృష్టిస్తూ 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం జగన్‌ చెప్పుకుంటున్నారన్నారు. గ్రూప్‌-1 పరీక్ష మూల్యాంకనంలో అవకతవకలపై ప్రజల దృష్టి మళ్లించడానికే ఈ ప్రకటనలు ఇస్తున్నారన్నారు. యేటా విడుదల చేస్తామన్న  జాబ్‌ క్యాలెండర్‌ వైసీపీ... రెండేళ్లయ్యాక తీరిగ్గా విడుదల చేసిందన్నారు. 6లక్షల ఉద్యోగాల్లో 2.5లక్షల మంది వలంటీర్లు ఉన్నారని, వీరంతా వైసీపీ కార్యకర్తలు కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పరిశ్రమలు రాకుండా తరిమేస్తున్న ప్రభుత్వం నిరుద్యోగం పెంచుతోందే కాని తగ్గించడం లేదన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సిద్దప్ప, జంగాల వెంకటరమణ, శివయ్య, కొటారుపల్లె భాస్కర పాల్గొన్నారు.

Updated Date - 2021-06-19T05:19:56+05:30 IST