‘ఫాలూన్ గాంగ్‌’పై చైనాలో ఆ దారుణం జరిగింది ఈ రోజే..

ABN , First Publish Date - 2021-04-26T02:02:25+05:30 IST

శాంతియుత నిరసనల చరిత్రలో 1999 ఏప్రిల్ 25కి ప్రత్యేక స్థానం ఉంది.

‘ఫాలూన్ గాంగ్‌’పై  చైనాలో ఆ దారుణం జరిగింది ఈ రోజే..

న్యూఢిల్లీ: శాంతియుత నిరసనల చరిత్రలో 1999 ఏప్రిల్ 25కి ప్రత్యేక స్థానం ఉంది. ఈ నిరసనకు మార్టిన్ లూథర్ కింగ్, మహాత్మా గాంధీ సైతం మద్దతిచ్చి ఉండేవారు. ఫాలున్ గాంగ్‌పై తప్పుడు ఆరోపణలు గుప్పిస్తూ ప్రచురితమైన వ్యాసం గురించి మాట్లాడటానికి 45 మంది ఫాలున్ గాంగ్ సభ్యులు ఓ మ్యాగజైన్ ప్రచురణకర్త వద్దకు వెళ్ళారు. అయితే ఈ అంశాన్ని బీజింగ్‌లోని ఝోన్‌గ్‌నన్‌హై సెంట్రల్ గవర్నమెంట్ కాంపౌండ్‌కు పక్కనే ఉన్న స్టేట్ అపీల్స్ ఆఫీసు దృష్టికి తీసుకెళ్ళాలని తియాంజిన్ పోలీసులు ఫాలున్ గాంగ్ సభ్యులకు చెప్పారు. 


ఫాలున్ గాంగ్‌ను ఆచరిస్తున్న దాదాపు 10 వేల మంది సెంట్రల్ బీజింగ్‌లో ఆ రోజు సమావేశమయ్యారు. తమ పౌర హక్కుల కోసం వీరంతా శాంతియుతంగా నిరసన తెలిపారు. దీనిలో పెద్ద ఎత్తున పాల్గొన్న ఫాలున్ గాంగ్ సభ్యుల సంఖ్యనుబట్టి మాత్రమే కాకుండా, ఈ నిరసన అత్యంత శాంతియుతంగా, క్రమబద్ధంగా జరిగినందు వల్ల ఏప్రిల్ 25న వీరంతా చేసిన విజ్ఞప్తి అందరూ గుర్తించదగినది అయింది.


అయితే ఫాలున్ గాంగ్‌ను అణచివేయడం కోసం చైనీస్ కమ్యూనిస్టు పార్టీ అక్రమ మార్గాల్లో ప్రయత్నించింది. తన కుటిల లక్ష్యాలకు ఉపయోగపడే విధంగా ఫాలున్ గాంగ్ గురించిన యథార్థాలను తారుమారు చేసింది. ఇప్పటికీ కమ్యూనిస్టు పార్టీ చేసే ఆరోపణ ఏమిటంటే, 1999 ఏప్రిల్ 25న ఫాలున్ గాంగ్ ఝోంగ్‌నన్‌హాయ్ సెంట్రల్ గవర్నమెంట్ కాంపౌండ్‌ను ముట్టడించిందని చెప్తూ ఉంటుంది. దేశానికి, దేశ నేతలకు హింసాత్మక ముప్పు కలిగే విధంగా  10 వేల మంది ఒక చోట చేరినట్లు తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉంటుంది. 


నేను చెప్తున్నది ఎంత మాత్రం నిజం కాదని నాకు తెలుసు, నేను పట్టించుకోనని కూడా నీకు తెలుసు. కానీ అసలు సత్యం నుంచి ఏదీ బయటపడకూడదు - అన్నట్లుగా చైనా ప్రభుత్వ తీరు ఉంది. ఆ రోజంతా ట్రాఫిక్ సజావుగా సాగింది. వాహనాలు, పాదచారులు సజావుగా ప్రయాణాలు చేసే విధంగా కొందరు ఫాలున్ గాంగ్ ప్రాక్టీషనర్లు చొరవ తీసుకున్నారు. పాదచారులు రోడ్డు పక్కనున్న సైడ్‌వాక్‌పై నడిచేందుకు వీలుగా ఫాలున్ గాంగ్ ప్రాక్టీషనర్లు రోడ్డు అంచులో నడిచేవారు. ఈ ప్రాక్టీషనర్లంతా చాలా ప్రశాంతంగా, శాంతియుతంగా వ్యవహరించారు. 


సుమారు రాత్రి 10 గంటల సమయంలో ఝోంగ్‌నన్‌హాయ్ వెస్ట్ గేట్ నుంచి ఓ సందేశం వచ్చింది : ‘‘ప్రతినిధులు తిరిగి వచ్చారు, ప్రాక్టీషనర్ల విజ్ఞప్తులను సెంట్రల్ కమిటీ నేతలకు తెలియజేశారు. తియాంజిన్ పోలీసులు అరెస్టు చేసిన ప్రాక్టీషనర్లందరినీ విడుదల చేశారు. అందరూ ఇక ఇళ్ళకు వెళ్ళిపోవచ్చు.’’ ప్రాక్టీషనర్లు తమ పరిసరాలను శుభ్రం చేశారు, పోలీసులు పడేసిన సిగరెట్ పీకలను సైతం తీశారు. 20 నిమిషాల కన్నా తక్కువ సమయంలోనే ప్రాక్టీషనర్లంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. 


తప్పుడు వాగ్దానాలు చేసిన రెండు నెలల తర్వాత, 1999 జూలై 20న పాలున్ గాంగ్ ప్రాక్టీషనర్లపై అత్యంత దారుణమైన అణచివేత ప్రారంభమైంది. ఇది నేటికీ కొనసాగుతోంది. కనీసం 10 లక్షల మంది తమ విశ్వాసం కారణంగా, సత్యం, కారుణ్యం, సహనం అనే సిద్దాంతాలను అనుసరించినందుకు హత్యకు గురయ్యారు. గడచిన 21 సంవత్సరాల్లో, లెక్కలేనంత మంది ప్రాక్టీషనర్లను అరెస్టు చేశారు, నిర్బంధించారు, జైళ్ళలో బంధించారు, హింసించారు, అంతేకాకుండా వారి అవయవాల కోసం చంపేశారు. అణచివేత కారణంగా 4,300 మందికి పైగా మరణించినట్లు ధ్రువపడింది. భయానక ప్రచారం వల్ల అనేక మంది తప్పుదోవపట్టారు, చాలా మంది తమకు తెలియకుండానే ఫాలున్ గాంగ్ ప్రాక్టీషనర్ల అణచివేతకు సాయపడ్డారు. 


ఫాలున్ గాంగ్‌ను ప్రాక్టీస్ చేసే స్టార్ ఎంప్లాయీస్‌ను కంపెనీలు తొలగించాయి. ఈ ప్రాక్టీషనర్లు నివసించే ప్రాంతాల్లో ఇరుగుపొరుగువారు నగదు పురస్కారాల కోసం వారి సమాచారాన్ని పోలీసులకు అందజేశారు. భార్యాభర్తల్లో ఒకరు ఫాలున్ గాంగ్ ప్రాక్టీషనర్ అయితే తనను కేసుల్లో ఇరికిస్తారనే భయంతో మరొకరు విడాకులిచ్చేశారు. ఈ ప్రాక్టీషనర్లు తమ విశ్వాసాన్ని త్యజించడంలో వారి తల్లిదండ్రులు, సోదరులు, అక్కచెల్లెళ్ళు కూడా అధికారులకు సహాయపడ్డారు. ఫాలున్ గాంగ్‌ను ‘మూడు నెలల్లో’ అణచివేయడానికి చైనీస్ కమ్యూనిస్టు పార్టీ ప్రయత్నాలు ప్రారంభించిన 21 ఏళ్ళ తర్వాత, లెక్కలేనంత మంది చైనీయులు దీనిని ప్రాక్టీస్ చేయడం ద్వారా శాంతి, ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించడం కొనసాగిస్తున్నారు. దీనికోసమే మరింత ఎక్కువ మంది శాంతియుతంగా తమ హక్కుల కోసం గళమెత్తుతున్నారు. 

Updated Date - 2021-04-26T02:02:25+05:30 IST