రైతన్నకు ఇదే కష్టం!

ABN , First Publish Date - 2021-06-15T05:27:43+05:30 IST

జిల్లాలో ధాన్యం బకాయిల కోసం అన్నదాతలు ఎదురు తెన్నులు చూస్తున్నారు. వందల కోట్ల రూపాయల ధాన్యం బకాయిలు గత రెండు నెలల నుంచి చెల్లించకపోవడంతో రైతులు ఎక్కడికక్కడే ఆందోళన చేస్తున్నారు. బకాయిలు చెల్లించాలంటూ ఐ.పోలవరం మండల రైతాంగం ఒక అడుగు ముందుకువేసి ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. గత రెండు నెలల నుంచి ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న ధాన్యం బకా యిలను వెంటనే చె

రైతన్నకు ఇదే కష్టం!
ఐ.పోలవరంలో డిప్యూటీ తహశీల్దార్‌కు వినతిపత్రం అందిస్తున్న రైతులు

48 రోజులు గడిచినా సొమ్ములు లేవు

దాన్యం బకాయిల కోసం జిల్లాలో               

అన్నదాతల ఎదురుచూపులు

రైతులకు చెల్లించాల్సింది రూ.900 కోట్లపైనే 

తక్షణం బకాయిలు ఇవ్వకపోతే ఖరీఫ్‌లో క్రాప్‌ హాలిడే

ఐ పోలవరంలో రైతుల హెచ్చరిక


(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ధాన్యం బకాయిల కోసం అన్నదాతలు ఎదురు తెన్నులు చూస్తున్నారు. వందల కోట్ల రూపాయల ధాన్యం బకాయిలు గత రెండు నెలల నుంచి చెల్లించకపోవడంతో రైతులు ఎక్కడికక్కడే ఆందోళన చేస్తున్నారు. బకాయిలు చెల్లించాలంటూ ఐ.పోలవరం మండల రైతాంగం ఒక అడుగు ముందుకువేసి ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. గత రెండు నెలల నుంచి ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న ధాన్యం బకా యిలను వెంటనే చెల్లించకపోతే ఈ ఖరీఫ్‌ సాగుకు క్రాప్‌ హాలిడే ప్రకటించాల్సి వస్తుందని రైతులు హెచ్చరించారు. వివిధ రాజకీయపక్షాల నాయకులు కూడా ధాన్యం బకాయిల కోసం తమదైన శైలిలో ఆందోళనకు శ్రీకారం చుట్టారు. ఆరుగాలం శ్రమించి పండించిన దాళ్వా ధాన్యాన్ని రైతుభరోసా కేంద్రాలు, సొసైటీల ద్వారా ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొను గోలు ద్వారా విక్రయించారు.


రైతులతోపాటు చిన్నా, చితకా వ్యాపారులు, దళారులు సైతం ఆయా సొసైటీల్లో ధాన్యాలను విక్రయించి సొమ్ముల కోసం సొసైటీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సుమారు రూ.900 కోట్ల పైనే సివిల్‌ సప్లయిస్‌శాఖ అధికారులు బకాయిలు చెల్లించాల్సి ఉంది. రెండు నెలలైనా బకాయిల విడుదలలో రైతులకు సొమ్ములు అందలేదు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదలచేస్తే తప్ప బకాయిలు చెల్లించలే మని సివిల్‌ సప్లయిస్‌శాఖ అధికారులు రైతులకు తేల్చి చెబుతున్నారు. ఇప్పటివరకు రైతులకు రూ.255 కోట్లు మాత్రమే చెల్లించారనేది రాజకీయ పార్టీల నాయకుల ఆరోపణ. బకాయి లు చెల్లించకపోతే వడ్డీల భారం తీవ్రమవడం, సొసైటీలకు జూన్‌ నెలాఖరులోగా అప్పులు చెల్లించి రుణాలు రీషెడ్యూల్‌ చేయకపోతే వడ్డీ రాయితీని కోల్పోవలసి వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.


ఇదిలా ఉండగా ఐ.పోలవరం మండ లంలోని బాణాపురం, పెదమడి, కొత్తపల్లి, ఐ.పోలవరం గ్రామాలకు చెందిన రైతులు సోమవారం ఆందోళనలు చేప ట్టారు. ఇప్పటికే అమలాపురం రూరల్‌ మండలంలోని నడి పూడి, అయినవిల్లి, అల్లవరం మండలాల రైతులు బకాయిల విడుదల కోరుతూ పెద్దఎత్తున ఆందోళనకు దిగిన విషయం విదితమే. ఇలా దశలవారీగా రైతులు నిరసనలకు శ్రీకారం చుడుతున్నారు. కొవిడ్‌ నిబంధనలు దృష్ట్యా సామరస్యంగా ఆందోళన చేస్తున్నామని, కోనసీమవ్యాప్తంగా భారీ స్థాయిలో బకాయిల విడుదల కోరుతూ అన్ని రాజకీయపార్టీలతో కలసి ఉద్యమం చేపడతామంటూ రైతులు హెచ్చరిస్తుండడంతో సివిల్‌ సప్లయిస్‌ అధికారుల వెన్నులో వణుకు పుడుతోంది. 


ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం : మట్టా

అమలాపురం రూరల్‌, జూన్‌ 14 : ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యానికి 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లో సొమ్ములు జమ చేస్తామని ప్రకటించి 48 రోజులు గడిచినా బకాయిలు చెల్లించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య విధా నానికి నిదర్శనంగా నిలుస్తుందని అమలాపురం పార్లమెంటు జిల్లాశాఖ తెలుగురైతు అధ్యక్షుడు మట్టా మహాలక్ష్మి ప్రభాకర రావు ఆరోపించారు. ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ధాన్యం కొనుగోలు సొమ్ములను తక్షణం విడుదలచేసి రైతుల ను ఆదుకోవాలని డిమాండు చేశారు. గత నెల రోజులుగా రైతుల ఖాతాలకు ధాన్యం సొమ్ములు జమ కావడంలేదన్నారు. జిల్లాలో రూ.900 కోట్ల మేర రైతులకు సివిల్‌ సప్లయిస్‌ శాఖ ద్వారా చెల్లించాల్సి ఉందన్నారు. రైతులు బ్యాంకు రుణాలను నెలాఖరులోగా చెల్లించకుంటే పావలా వడ్డీ, సున్నావడ్డీ పథ కం వర్తించదని ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిలు తక్షణం చెల్లించని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. 


ఐ పోలవరంలో రైతుల నిరసన

ఐ.పోలవరం, జూన్‌ 14: ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం సొమ్ము బకాయిలు త్వరితగతిన విడుదల చేయకపోతే ఖరీఫ్‌ సాగుకు క్రాప్‌హాలీడే ప్రకటిస్తామని రైతులు హెచ్చరించారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న తీరును నిరసిస్తూ ఐ.పోలవరంలో సోమవారం రైతులు ఆందోళన నిర్వహించారు. దాళ్వా పంట ధాన్యం ప్రభుత్వ యంత్రాంగం ద్వారా కొనుగోలు చేసి రెండు నెలలు కావొస్తున్నా సొమ్ములు చెల్లించకపోవడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కావడంతో తాము ఎక్కడినుంచి సొమ్ములు తెచ్చి పెట్టుబడి పెట్టుకోవాలని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిం చారు. ఇప్పటికే అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి రబీ సాగు చేపట్టినా ఇంతవరకు చిల్లిగవ్వ కూడా తమ చేతికి అందకపోవడం మరింత అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని వారు ఆవేదన చెందారు. అంతేకాకుండా ఉపాధి హామీ పథకాన్ని కోతల సమయంలో అమలుచేయడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ధాన్యం సొమ్ములు వెంటనే విడుదల చేయకపోతే ఖరీఫ్‌ సాగుకు క్రాప్‌హాలీడే ప్రకటిస్తామని వారు హెచ్చరించారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్‌ పి.వెంకట్రావుకు వినతిపత్రం అందజేశారు. రైతులు సాగిరాజు సూరిబాబు, నల్లా మోహనరావు, దంగుడుబియ్యం మోహన్‌, పేరాబత్తుల రాఘవులు, అబ్బిరెడ్డి కుమార్‌తోపాటు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-15T05:27:43+05:30 IST