Advertisement
Advertisement
Abn logo
Advertisement

సంగారెడ్డిలో దారుణం.. : డబ్బు విషయంలో గొడవ.. ఉరేసుకున్న భర్త.. పిల్లలతో చెరువులో దూకిన భార్య..

హైదరాబాద్ సిటీ/సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు కుటుంబాన్ని బలి తీసుకున్నాయి. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ ఎంఐజీ కాలనీలో నివాసం ఉంటున్న చంద్రకాంత్ గురువారం తన భార్య లావణ్యతో గొడవపడ్డాడు. డబ్బు విషయంలో ఇరువురి మధ్య గొడవ జరిగింది. దాంతో మనస్తాపం చెందిన లావణ్య తమ పిల్లలు ప్రేతమ్(7), సర్వజ్ఞ(2)లను తీసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోయింది.

తాను ఇంట్లోంచి వెళ్ళొపోతున్నానని భర్తకు ఫోన్ చేసి చెప్పింది. కొడుకు, కూతురితో సహా భార్య ఇంటి నుంచి వెళ్లిపోవడంతో చంద్రకాంత్ భయపడ్డాడు. దీంతో గురువారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. లావణ్య కూడా పిల్లలతో సహా ఆందోలు మండలంలోని పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ముగ్గురి మృదేహాలు శుక్రవారం ఉదయం చెరువులో బయటపడ్డాయి. జోగిపేట పోలీసులు మృతదేహాలను చెరువులో నుండి బయటకు తీసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. 


Advertisement
Advertisement