కుటుంబ కంపెనీలదే హవా

ABN , First Publish Date - 2020-08-04T06:11:06+05:30 IST

ఆర్థిక వ్యవస్థలో దోరణులకు అనుగుణంగా కుటుంబ నిర్వహణలోని కంపెనీలు మారలేవన్న అంచనాలను దేశీయ కుటుంబ

కుటుంబ కంపెనీలదే హవా

  • సేవల రంగంలో దూకుడు: ఐఎస్‌బీ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఆర్థిక వ్యవస్థలో దోరణులకు అనుగుణంగా కుటుంబ నిర్వహణలోని కంపెనీలు మారలేవన్న అంచనాలను దేశీయ కుటుంబ నిర్వహణ కంపెనీలు వమ్ము చేశాయి. భారత ఆర్థిక వ్యవస్థలో ఫ్యామిలీ కంపెనీల ప్రాధాన్యాన్ని మరో సారి నిరూపించాయి. సరళీకరణ తర్వాత తయారీ రంగంలోని కుటుంబ కంపెనీలు చాలా వేగంగా సేవల రంగంలోకి అడుగు పెట్టి తమ సత్తా నిరూపించుకున్నాయని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినె్‌స (ఐఎ స్‌బీ) విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది. ఫ్యామిలీ వ్యాపారాలు-సేవల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ మార్పు అనే అంశంపై  ఐఎ్‌సబీకి చెందిన థామస్‌ షుమిఽధినీ సెంటర్‌ ఈ నివేదికను విడుదల చేసింది. వేగంగా వృద్ధి చెందుతున్న డిజిటలైజేషన్‌, ఐటీ వంటి రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవడంలో దేశీయ కుటుంబ నిర్వహణ కంపెనీలు చూపిస్తున్న ఆసక్తి, విజయంపై వాటికి ఉన్న ఆతృతను నిరూపిస్తున్నాయని నివేదిక వివరించింది. ఎన్‌ఎ్‌సఈ, బీఎ్‌సఈలో లభించిన డేటా ఆధారంగా 28 సంవత్సరాల కాలంలో దాదాపు 4589 కంపెనీల్లో వచ్చిన మార్పులను అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించారు. గత శతాబ్దం ఎనిమిదో దశకంలో స్టాండ్‌ అలోన్‌ ఫ్యామిలీ ఫర్మ్‌లు (ఎస్‌ఎ్‌ఫఎ్‌ఫ)లు సేవల రంగంలోకి అడుగు పెట్టడం ప్రారంభించాయి. కుటుంబ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సానుకూల దృక్పథంతో వ్యాపారాలను ఎప్పటికప్పుడు పునర్‌వ్యవస్థీకరిస్తూ.. వచ్చిన అవకాశాలను అందుకున్నారు. ఈ శతాబ్దపు మొదటి సంవత్సరాల్లో ఫైనాన్షియల్‌ సేవలు, ఐటీ, టెక్నాలజీ సేవలు, టెలికమ్యూనికేషన్‌ తదితర రంగాలు కీలకంగా మారాయి. ఈ రంగాలలో కూడా కుటుం బ కంపెనీలు తమ పట్టును నిలబెట్టుకున్నాయి. కొత్త తరం సేవల రంగాల్లో కూడా కుటుంబేతర కంపెనీలతో పోలిస్తే కుటుంబ కంపెనీల ఆస్తులు అధికంగా ఉన్నాయని తెలిపింది.

Updated Date - 2020-08-04T06:11:06+05:30 IST