Abn logo
May 6 2021 @ 18:20PM

దారుణం.. కరోనా నెపంతో వృద్ధురాలిని వదిలేసి వెళ్లిన కూతురు

ఏలూరు: పెనుమంట్ర మండలం మార్టేరులో దారుణం జరిగింది. కరోనా నెపంతో వృద్ధురాలిని కుటుంబ సభ్యులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద చెట్టు కింద వదిలి వెళ్ళారు. భీమవరం మండలం వెంపగ్రామంలో కూతురు ఇంటి వద్ద ఉండగా వృద్ధురాలు వెంకమ్మ కరోనా బారిన పడ్డారు. ఈ మధ్యాహ్నం మార్టేరు పీహెచ్‌సీ‌కి తీసుకెళ్లి  వృద్ధురాలిని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఇంకా ఘోరం ఏంటటే... ఆ వృద్ధురాలిని పీహెచ్‌సీ సిబ్బంది కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో వెంకమ్మ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. సాయం కోసం వృద్ధురాలు ఎదురు చూస్తున్నారు. 

Advertisement