ఇంట్లోంచి పారిపోయి ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి.. 8 నెలల తర్వాత సొంతూరికి.. ఆమె అన్నలకు విషయం తెలిసి..

ABN , First Publish Date - 2021-11-13T01:17:31+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్ గణేష్ ఘాట్ అనే గ్రామానికి చెందిన అర్చన.. అదే గ్రామానికి చెందిన సునిల్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. కొన్నాళ్లు వీరి ప్రేమ వ్యవహారం బాగానే నడిచింది. తర్వాత

ఇంట్లోంచి పారిపోయి ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి.. 8 నెలల తర్వాత సొంతూరికి.. ఆమె అన్నలకు విషయం తెలిసి..

వారిద్దరూ ఎంతో ఇష్టపడ్డారు. చావైనా, బతుకైనా కలిసి జీవించాలని కలలు కన్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా మారిపోయారు. ఈ క్రమంలో వీరి ప్రేమ విషయం పెద్దలకు తెలిసింది. చాలా కుటుంబాల్లో మాదిరే.. వీరి పెద్దలు కూడా ప్రేమను అంగీకరించలేదు. దీంతో ఆ ప్రేమికులు ఇంట్లోంచి పారిపోయి  పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఎంతో ఆనందంగా జీవించసాగారు. కొన్నాళ్లకు సొంతూరుకు వెళ్దామని అనుకున్నారు. అయితే తర్వాత జరిగిన ఘటన గురించి తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..


ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్ గణేష్ ఘాట్ అనే గ్రామానికి చెందిన అర్చన.. అదే గ్రామానికి చెందిన సునిల్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. కొన్నాళ్లు వీరి ప్రేమ వ్యవహారం బాగానే నడిచింది. తర్వాత విషయం ఇరు కుటుంబాల వారికి తెలిసింది. అయితే యువతి కుటుంబ సభ్యులు మాత్రం అంగీకరించలేదు. దీంతో పెద్దలకు తెలీకుండా ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఉత్తరాఖండ్‌ కాశీపూర్‌లోని బంధువుల ఇంటికి వెళ్లిపోయారు. యువకుడు అక్కడే పని చేస్తూ భార్యను పోషించుకునేవాడు. అయితే ఎనిమిది నెలల అనంతరం ఇంటికి వెళ్దామని అనుకున్నారు. తమ మీద పెద్దలకు కోపం తగ్గుంటుందిలే అనుకుని.. ఈ ఏడాది జూలైలో సొంతూరికి వచ్చేశారు. ఈ విషయం యువతి అన్నలకు తెలిసింది.


ఆగ్రహంతో ఊగిపోయిన యువతి అన్నలైన ప్రదీప్, సంజయ్, రాజ్‌కుమార్, సోనూ.. చెల్లెలు ఉంటున్న ఇంటికి వెళ్లారు. విచక్షణారహితంగా కర్రలతో దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన ఆమె.. అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొంతసేపటికి ఇంటికొచ్చిన భర్త సునీల్.. రక్తపు మడుగులో పడి ఉన్న అర్చనను చూసి షాకయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించాడు. అయితే తీవ్రగాయాలవడంతో ఆమె నడవలేని పరిస్థితిలో ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేశారు. అనంతరం కోర్టుకు ఆమెను స్ట్రెచర్‌పై తీసుకెళ్లి వాంగ్మూలం తీసుకోవాల్సిందిగా కోరారు. విచారించిన న్యాయస్థానం విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

Updated Date - 2021-11-13T01:17:31+05:30 IST