'నా మనవరాలు అంతరిక్షానికి వెళ్తుందంటే.. పట్టలేనంత సంతోషంగా ఉంది'

ABN , First Publish Date - 2021-07-06T23:52:52+05:30 IST

తొలిసారిగా తెలుగమ్మాయి బండ్ల శిరీష(26) అంతరిక్షయానం చేయనున్నారు. ఈ నెల 11న అమెరికాకు చెందిన ‘వర్జిన్‌ గెలాక్టిక్‌’ సంస్థ న్యూమెక్సికో నుంచి ప్రయోగించే వాహక నౌకలో ఆమె గగనానికి వెళ్లనున్నారు. సంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్‌ బ్రాన్సన్‌తో కలిసి ఆరుగురు ఈ వాహక నౌకలో పయనించనున్నారు.

'నా మనవరాలు అంతరిక్షానికి వెళ్తుందంటే.. పట్టలేనంత సంతోషంగా ఉంది'

మా ఆనందానికి అవధుల్లేవు: శిరీష బండ్ల తాత బండ్ల రాగయ్య

గుంటూరు: తొలిసారిగా తెలుగమ్మాయి బండ్ల శిరీష(26) అంతరిక్షయానం చేయనున్నారు. ఈ నెల 11న అమెరికాకు చెందిన ‘వర్జిన్‌ గెలాక్టిక్‌’ సంస్థ న్యూమెక్సికో నుంచి ప్రయోగించే వాహక నౌకలో ఆమె గగనానికి వెళ్లనున్నారు. సంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్‌ బ్రాన్సన్‌తో కలిసి ఆరుగురు ఈ వాహక నౌకలో పయనించనున్నారు. వీరిలో శిరీష ఒకరు. కల్పన చావ్లా తర్వాత అంతరిక్ష యానానికి వెళ్తున్న రెండో భారత సంతతి మహిళ శిరీష. ఇదిలాఉంటే.. శిరీష గగనయానానికి వెళ్తుతుండడం పట్ల ఆమె స్వస్థలం ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన ఆమె కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. తమ ఆనందానికి అవధుల్లేవని శిరీష తాత బండ్ల రాగయ్య అన్నారు.


పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామానికి చెందిన బండ్ల రాగయ్యకు శిరీష రెండో మనవరాలు. ఈయన ఎన్జీరంగా అగ్రి వర్సిటీ ప్రిన్సిపల్‌ సైంటిస్టుగా పనిచేసి రిటైరయ్యారు. శిరీష తన బాల్యం నుంచే అంతరిక్షయానం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఈ సందర్భంగా తాత రాగయ్య గుర్తు చేశారు. "చిన్నప్పుడు ఆమె ఎప్పుడూ చూసిన ఆకాశం వైపే చూస్తుండేది. అక్కడికి ఎలా వెళ్లాలి, అక్కడ ఏం ఉంటాయని తరచూ నన్ను అడిగేది. ఇవాళ ఆమె కల నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా ఆనందానికి అవధుల్లేవు. నా మనవరాలు అంతరిక్షానికి వెళ్తుందన్న విషయాన్ని తలచుకున్న ప్రతిసారి నా హృదయం సంతోషంతో పులకించిపోతుంది. పట్టలేనంత సంతోషంగా ఉంది" అని రాగయ్య చెప్పుకొచ్చారు.  

Updated Date - 2021-07-06T23:52:52+05:30 IST