ఫైవ్‌స్టార్ హోటల్‌లో దిగిన వారంతా.. ఆవిరి గదిలోకి వెళుతూ, ఆహారాన్ని ఆర్డర్ చేశారు.. వెయిటర్ వారిని అలా చూసి గట్టిగా కేకలు పెట్టాడు.. ఇంతకీ గదిలో ఏం జరిగింది?

ABN , First Publish Date - 2021-10-19T17:05:34+05:30 IST

కుటుంబ సభ్యులతో ఆనందంగా పర్యాటక ప్రాంతాల్లో..

ఫైవ్‌స్టార్ హోటల్‌లో దిగిన వారంతా.. ఆవిరి గదిలోకి వెళుతూ, ఆహారాన్ని ఆర్డర్ చేశారు.. వెయిటర్ వారిని అలా చూసి గట్టిగా కేకలు పెట్టాడు.. ఇంతకీ గదిలో ఏం జరిగింది?

కుటుంబ సభ్యులతో ఆనందంగా పర్యాటక ప్రాంతాల్లో విహరించాలని అందరికీ ఉంటుంది. సెలవులు దొరికినప్పుడు అందరూ కలిసి ఆనందంగా అలా తిరిగి రావాలనుకుంటారు. ఇదే కోవలో ఆహ్లాదంగా విహార యాత్రలు చేయాలనుకున్న ఆ కుటుంబాన్ని తీరని విషాదం వెంటాడింది. ఈ ఘటన మాస్కోలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన సర్జీ బురెన్కోవ్(60), అతని భార్య నటాల్యా బురెస్కోవ్(58), కుమార్తె కాట్యా(31), బంధువు నికితా బురెన్కోవ్(37)లు సెలవులను ఆనందంగా గిడిపేందుకు అల్బేనియా వెళ్లారు. అక్కడ వారు ఒక ఫైవ్‌స్టార్ హోటల్‌లో బస చేయాల్సివుంది. 


వారు ఆ గ్లోరియా ప్యాలెస్ హోటల్‌కు చేరుకోగానే అక్కడి స్టాప్.. ముందుగా మీరంతా ఆ ఆవిరిగదిలోకి వెళ్లి కాసేపు సేదితీరి రండి.. అని తెలిపారు. దీంతో వారంతా ఆనందంగా ఆ గదిలోనికి వెళ్లారు. అయితే ఊహించని విధంగా వారంతా ఊపిరాడక ఆ గదిలో మృతి చెందారు. ఈ అనూహ్య ఘటనపై పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు. ఆ ఆవిరిగదిలో వెంటిలేషన్ సిస్టమ్ సరిగా లేనందునే వారు మృతి చెందివుంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ కుటుంబ సభ్యులు గత కొంతకాలంగా పలు పర్యాటక ప్రాంతాలు చుట్టివస్తున్నారు. ఇక్కడికి వచ్చాక వారు ఆవిరి గదిలోకి వెళ్లేముందు వారు తమకు ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్ చేశారు. దానిని తీసుకువచ్చిన వెయిటర్ ఆవిరి గది ముందు నిలుచుని వారిని పిలిచాడు. ఎంతకీ సమాధానం రాకపోవడంతో అతనే తలుపులు తీసుకుని లోనికి వెళ్లాడు. అక్కడ వారంతా అచేతనంగా పడివున్నారు. వెంటనే హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.



Updated Date - 2021-10-19T17:05:34+05:30 IST