Advertisement
Advertisement
Abn logo
Advertisement

టిక్‌టాక్‌కు బానిసైన ప్రముఖ వైద్యుడికి భారీ షాక్..!

ఇంటర్నెట్ డెస్క్: లక్షల మంది ఫాలోవర్లు..ఎప్పుడూ టిక్‌టాక్ వీడియోలు చేయాలనే ధ్యాస.. ఇదేదో టీనేజర్ వ్యవహారం కాదు.. ఆస్ట్రేలియాకు చెందిన ఓ ప్రముఖ వైద్యుడి శైలి ఇది. అయితే.. ఇదే చివరికి ఆయన కొంప ముంచింది. రోగులకు చికిత్స చేసేటప్పుడు కూడా ఆయన టిక్‌టాక్ వీడియోలు చేస్తుండటంతో అనేక మంది పేషెంట్లు ఫిర్యాదు చేశారు. దీంతో.. అక్కడి ప్రభుత్వం సదరు వైద్యుడికి ఊహించని షాకిచ్చింది. ఇకపై ఇతరుల పర్యవేక్షణలో మాత్రమే అతడు వైద్యం చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటువంటి విచిత్ర పరిస్థతి ఎదుర్కొన్న వ్యక్తి పేరు డా. డేనియల్ ఆరోనావ్. టీనేజర్ లాగా టిక్‌టాక్‌కు బానిసై ఇలాంటి పరిస్థితి కొని తెచ్చుకున్న ఆరోనావ్ గురించి ప్రస్తుతం ఆస్ట్రేలియన్లు కథలుకథలుగా చెప్పుకొంటున్నారు. 

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement