Jul 2 2021 @ 13:27PM

ఫ్యాన్సీ రేటుకి 'కె.జి.యఫ్‌ చాప్టర్‌2' ఆడియో హక్కులు

కన్నడ రాక్‌స్టార్‌ యశ్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో 'కె.జి.యఫ్‌ చాప్టర్‌1'కి కొనసాగింపుగా రూపొందుతోన్నపాన్‌ ఇండియా చిత్రం 'కె.జి.యఫ్‌ చాప్టర్‌2'. భారీ అంచనాలున్న ఈ సినిమా ఆడియో హక్కులు ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల మేరకు ప్రముఖ ఆడియో సంస్థ 'లహరి టీ సిరీస్‌' రూ.7 కోట్లకు పైగా భారీ మొత్తాన్ని చెల్లించి ఆడియో హక్కులను సొంతం చేసుకుంది. సంజయ్‌ దత్‌, రవీనాటాండన్‌ కీలక పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది క్రిస్మస్‌ సందర్భంగా 'కె.జి.యఫ్‌ చాప్టర్‌2'ను విడుదల చేస్తారని విడుదలవుతాయని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే హోంబలే ఫిలింస్‌ మూవీ రిలీజ్‌పై క్లారిటీ ఇవ్వనుంది.