Abn logo
Feb 28 2021 @ 12:50PM

ఫ్యాన్సీ ఆఫర్‌కు 'వకీల్‌సాబ్‌' హక్కులు.. కండీషన్‌ పెట్టిన నిర్మాతలు

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రం 'వకీల్‌సాబ్‌'. హిందీ `పింక్` రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకుడు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. శ్రుతీ హాసన్ అతిథి పాత్రలో నటించింది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో సినిమాపై ట్రేడ్‌ వర్గాల్లో క్రేజ్‌ పెరుగుతోంది. లేటెస్ట్‌ సమాచారం మేరకు ఈ సినిమా శాటిలైట్‌, డిజిటల్ హక్కులు ఫ్యాన్సీ ఆఫర్‌కు అమ్ముడయ్యాయట. 

శాటిలైట్‌ హక్కుల విషయానికి వస్తే, ప్రముఖ జీ స్టూడియోస్‌ శాటిలైట్‌ హక్కులను దక్కించుకుంది. అలాగే డిజిటల్‌ హక్కులను ప్రముఖ డిజిటల్ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ సంస్థ ఫ్యాన్సీ ఆఫర్‌తో దక్కించుకుంది. అయితే సినిమా విడుదలైన యాబై రోజుల తర్వాతే ఈ సినిమాలను టీవీ, డిజిటల్‌ మాధ్యమాల్లో ప్రసారం చేసుకోవాలనే కండీషన్‌పై నిర్మాతలు హక్కులను విక్రయించారని సమాచారం. 

Advertisement
Advertisement
Advertisement