న్యాయమూర్తి హిమా కోహ్లీకి వీడ్కోలు

ABN , First Publish Date - 2021-08-27T21:20:04+05:30 IST

తెలంగాణ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లీకి ఘనంగా వీడ్కోలు పలికారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా

న్యాయమూర్తి హిమా కోహ్లీకి వీడ్కోలు

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో జస్టిస్ హిమా కోహ్లీకి ఘనంగా వీడ్కోలు పలికారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయిన జస్టిస్ హిమాకోహ్లీకి న్యాయమూర్తులు, న్యాయవాదులు అభినందనలు తెలిపారు. హైకోర్టు ప్రాంగణంలో జస్టిస్ హిమా కోహ్లీకి బార్ అసోసియేషన్ వీడ్కోలు ఏర్పాటు చేశారు. ఇటీవల తొమ్మిది మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం సిఫార్సులపై రాష్ట్రపతి కోవింద్ ఆమోదముద్ర వేసిన వేసిన విషయం తెలిసిందే. జస్టిస్‌ బీవీ నాగరత్న (కర్ణాటక హైకోర్టు జడ్జి), జస్టిస్‌ హిమా కోహ్లీ (తెలంగాణ హైకోర్టు సీజే), జస్టిస్‌ బేలా త్రివేదీ (గుజరాత్‌ హైకోర్టు జడ్జి) కూడా సుప్రీం న్యాయమూర్తులుగా పదోన్నతి పొందారు. జస్టిస్‌ హిమా కోహ్లీ 1959 సెప్టెంబరు 2న జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ పట్టా పుచ్చుకున్నారు. 1984లో ఢిల్లీ బార్‌ కౌన్సిల్‌లో నమోదు చేసుకొని న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. 2006 మే 29న ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులై, 2007 ఆగస్టు 29న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఈ ఏడాది జనవరి 7 నుంచి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు.

Updated Date - 2021-08-27T21:20:04+05:30 IST