వారాంతంలో నష్టాల వీడ్కోలు

ABN , First Publish Date - 2021-07-31T06:27:57+05:30 IST

వారాంతం (శుక్రవారం) ట్రేడింగ్‌లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాలతో వీడ్కోలు పలికాయి. ప్రతికూల గ్లోబల్‌ సంకేతాల నేపథ్యంలో ఆరంభం నుంచి పరిమిత లాభాల శ్రేణిలో కదలాడిన సూచీలు.

వారాంతంలో నష్టాల వీడ్కోలు

66 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్‌ 

ముంబై: వారాంతం (శుక్రవారం) ట్రేడింగ్‌లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాలతో వీడ్కోలు పలికాయి. ప్రతికూల గ్లోబల్‌ సంకేతాల నేపథ్యంలో ఆరంభం నుంచి పరిమిత లాభాల శ్రేణిలో కదలాడిన సూచీలు.. ఆఖరి గంటలో అమ్మకాల ఒత్తిడి కారణంగా స్వల్ప నష్టాల్లో ముగిశాయి. బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 66.23 పాయింట్లు కోల్పోయి 52,586.84 వద్ద ముగిసింది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 15.40 పాయింట్ల తగ్గుదలతో 15,763.05 వద్ద స్థిరపడింది. చివర్లో ట్రేడర్లు బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, మెటల్‌ షేర్లలో లాభాల స్వీకరణకు దిగటమే నష్టా లకు కారణం. ఈవారం మొత్తానికి సెన్సెక్స్‌ 388.96 పాయిం ట్లు, నిఫ్టీ 93 పాయింట్ల క్షీణతను నమోదు చేసుకున్నాయి.  


 సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్‌ కంపెనీల్లో 17 నష్టపోగా.. మిగ తా 13 లాభపడ్డాయి. బజాజ్‌ ఫైనాన్స్‌ అన్నికంటే అధికంగా 2.59 శాతం పతనమైంది. ఎస్‌బీఐ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ కూడా 2 శాతానికి పైగా క్షీణించాయి. సన్‌ఫార్మా షేరు ఏకంగా 10.06 శాతం ఎగబాకి సెన్సెక్స్‌ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. మెరుగైన ఫలితాల దన్నుతో టెక్‌ మహీంద్రా షేరు సైతం 7.24 శాతం పుంజుకుంది. ఇంట్రాడేలోనైతే, 9.68 శాతం లాభంతో రూ.1,237 వద్ద సరికొత్త ఏడాది గరిష్ఠాన్ని నమోదు చేసుకుంది. 


దేవయాని ఇష్యూ ధర శ్రేణి రూ.86-90

పిజ్జా హట్‌, కేఎ్‌ఫసీ, కోస్టా కాఫీ స్టోర్ల ఫ్రాంచైజీ కంపెనీ దేవయాని ఇంటర్నేషనల్‌, ఎక్సారో టైల్స్‌ ఐపీఓలు వచ్చే నెల 4న ప్రారంభమై 6న ముగియనున్నాయి. దేవయాని ఐపీఓ ధర శ్రేణిని రూ.86-90గా ఖరారు చేయగా ఎక్సారో టైల్స్‌ ఇష్యూ ధరను రూ.118-120గా నిర్ణయించింది. 

Updated Date - 2021-07-31T06:27:57+05:30 IST