దుమ్ముపడి పంట నాశనం.. ఆవేశంలో ఆ రైతు ఎంత పని చేశాడంటే..

ABN , First Publish Date - 2022-01-11T10:28:21+05:30 IST

దుమ్ముపడి పంట నాశనం.. ఆవేశంలో ఆ రైతు ఎంత పని చేశాడంటే...

దుమ్ముపడి పంట నాశనం.. ఆవేశంలో ఆ రైతు ఎంత పని చేశాడంటే..

పొలంలో ఒక పంట పండించడానికి ఒక రైతు పడే కష్టం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ చేతికొచ్చే పంట నాశనమైపోతుంటే ఆ రైతు పడే బాధ అంతా ఇంతా కాదు. అలాంటి ఒక ఘటనలో ఒక రైతు చేతికొచ్చిన తన పంట నాశనపోయినందుకు ఆవేశపడి అందుకు కారణమైన వాళ్లను గొడ్డలితో నరికేశాడు. ఈ ఘటన ఛత్తీస్‌గడ్‌లో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రంలోని రాయ్‌గఢ్‌కి చెందిన ధోభి రామ్ అనే రైతు తన పొలం సాగు చేశాడు. సరిగా పంట చేతికొచ్చే కొన్ని రోజుల ముందు  ధోభి రామ్ పొలానికి సమీపంలో రాజేశ్ అగ్రవాల్(57) వ్యక్తి స్టోన్స్ మైనింగ్ ప్రారంభించాడు. దీంతో ఆ రాళ్ల వెలికితీత వల్ల ధోభిరామ్ పొలంపైకి స్టోన్ మట్టి, దుమ్ము, ధూళి వచ్చి పడేది. ఆ దుమ్ము వల్ల ధోభి రామ్ పంట మొత్తం నాశనమైపోయింది.


చేతికొచ్చే పంట ఒక్కసారిగా చేజారిపోవడంతో ధోభి రామ్ స్టోన్స్ మైనింగ్ ఓనర్ వద్దకు వెళ్లి తన పంటకు జరిగిన నష్టం గురించి చెప్పి.. ఏదైనా పరిహారం చెల్లించమని అడిగాడు. అందుకు రాజేశ్ ఒప్పుకోలేదు. ఈ క్రమంలో.. ఒకరోజు ఉదయం రాజేశ్ అగ్రవాల్ ఆ స్టోన్ మైనింగ్ ఆఫీస్ వద్దకు తన కారులో వెళ్లాడు. అతను కారు నుంచి దిగగానే ధోభి రామ్ పట్ట పగలు.. అందరిముందు ఒక గొడ్డలి తీసుకొని వచ్చి ఒక్కసారిగా రాజేశ్ అగ్రవాల్ మెడపై దాడిచేశాడు. గొడ్డలి వేటుకు రాజేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తరువాత ధోభి రామ్ అక్కడి నుంచి పారపోయాడు. 


రాజేశ్ అగ్రవాల్ హత్య గురించి తెలుసుకున్న పోలీసులు ధోభి రామ్ కోసం గాలిస్తుండగా.. నిందితుడు సమీపంలోని అడవుల్లో పట్టుబడ్డాడు. పోలీసులు ప్రస్తుతం ధోభీ రామ్‌పై హత్య కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.

Updated Date - 2022-01-11T10:28:21+05:30 IST