రైతు బిడ్డ.. సివిల్స్‌ టాపర్‌

ABN , First Publish Date - 2020-08-05T07:30:34+05:30 IST

సివిల్‌ సర్వీసెస్‌-2019 పరీక్షల ఫలితాలను యూపీఎ్‌ససీ మంగళవారం విడుదల చేసింది. ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్

రైతు బిడ్డ.. సివిల్స్‌ టాపర్‌

  • ఢిల్లీ యువకుడు జతిన్‌కు రెండో ర్యాంకు
  • యూపీ యువతి ప్రతిభా వర్మకు 3వ ర్యాంకు


న్యూఢిల్లీ, ఆగస్టు 4: సివిల్‌ సర్వీసెస్‌-2019 పరీక్షల ఫలితాలను యూపీఎ్‌ససీ మంగళవారం విడుదల చేసింది. ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌(ఐఏఎస్‌), ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌(ఐఎ్‌ఫఎస్‌), ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌(ఐపీఎస్‌), ఇతర కేంద్ర, గ్రూప్‌ ‘ఏ’, గ్రూప్‌ ‘బీ’ సర్వీసుల్లో మొత్తం 927 ఖాళీలకు గాను 829 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు ప్రకటించింది. వీరిలో 304 మంది జనరల్‌ కేటగిరీలో, ఓబీసీ కేటగిరీ నుంచి 251 మంది, ఎస్సీ కేటగిరీ నుంచి 129 మంది, ఎస్టీ కేటగిరీ నుంచి 67 మంది అర్హత సాధించినట్లు యూపీఎ్‌ససీ వివరించింది. తొలిసారి ప్రవేశపెట్టిన ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్‌) కోటా నుంచి 78 మంది ఎంపికైనట్లు తెలిపింది. 182 మంది ఫలితాలను రిజర్వ్‌లో పెట్టినట్లు, 11 మంది ఫలితాలను విత్‌హెల్డ్‌లో ఉంచినట్లు పేర్కొంది. హరియాణా రాష్ట్రం సోనిపట్‌కు చెందిన ప్రదీ్‌పకుమార్‌సింగ్‌ టాపర్‌గా నిలిచారు. ప్రదీ్‌పది వ్యవసాయ కుటుంబం. ఢిల్లీకి చెందిన జతిన్‌ కిశోర్‌ రెండో ర్యాంకు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రతిభా వర్మ మూడో ర్యాంకు (మహిళల్లో మొదటిర్యాంకు) సాధించారు. 2019 మే నెలలో సివిల్స్‌ ప్రిలిమినరీ, సెప్టెంబరులో మెయిన్స్‌ జరిగాయి. 2020 ఫిబ్రవరిలో ఇంటర్వ్యూ ప్రక్రియ ప్రారంభమైంది. 500 మంది  ఇంటర్వ్యూ అనంతరం కొవిడ్‌ కారణంగా వాయిదా వేశారు. తిరిగి జూలై 20వ తేదీ నుంచి ప్రారంభించి 31వ తేదీతో ముగించారు. సివిల్స్‌ విజేతలను ప్రధాని మోదీ అభినందించారు.


నాన్న ప్రేరణతో..

‘ఓ దశలో ఉద్యోగం, చదువు సమతూకం కష్టమైంది. దీంతో ఏకాగ్రత కోల్పోయేవాడిని. ఆ సమయంలో నాన్న సుఖ్బీర్‌ సింగ్‌ రైతు అండగా నిలిచి ప్రేరణ కలిగించారు’ అని సివిల్స్‌ టాపర్‌ ప్రదీప్‌కుమార్‌ తన విజయ నేపథ్యాన్ని వివరించారు. 29 ఏళ్ల ప్రదీప్‌కుమార్‌ నాలుగుసార్లు సివిల్స్‌ రాశారు. 2019 సివిల్స్‌లోనే ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌(కస్టమ్స్‌-సెంట్రల్‌ ఎక్సైజ్‌)కు ఎంపికై ప్రస్తుతం నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కస్టమ్స్‌లో శిక్షణలో ఉన్నారు.వ్యవసాయం, విద్యా రంగాలపై దృష్టిసారించి పేద, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని చెబుతున్నారు. కాగా, పద్రీప్‌ తండ్రి సుఖ్బీర్‌ సింగ్‌ రైతు. తల్లి గృహిణి. సోదరుడు బీమా రంగంలో పనిచేస్తుండగా.. చెల్లెలు ఎంఎస్సీ చదువుతోంది. తన విజయం స్ఫూర్తితో.. ఎలాంటి ఒత్తిడి లేకుండా చెల్లిని కూడా సివిల్స్‌ సాధన దిశగా ప్రోత్సహిస్తానని ప్రదీప్‌ చెప్పారు.


  1. జతిన్‌ కిషోర్‌ తొలి ప్రయత్నంలో.. 2018 సివిల్స్‌లో ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీస్‌(ఐఈఎ్‌స)కు ఎంపికయ్యారు. ప్రస్తుతం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖలో ఏడీగా పనిచేస్తున్నారు. ‘పర్యావరణం, విద్యా రంగాలపై దృష్టిసారిస్తా’ అని ఆయన తెలిపారు. 
  2. ప్రతిభావర్మ మహిళల విభాగంలో టాపర్‌గా నిలిచారు. 2018 సివిల్స్‌లో 489 ర్యాంక్‌ సాధించిన ఆమె ప్రస్తుతం ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ (ఆదాయ పన్ను)లో పనిచేస్తున్నారు. కలెక్టర్‌ కావాలన్నది తన చిన్ననాటి కలగా తెలిపారు. ‘సంక్షోభ సమయాల్లో ముందుండి ఐఏఎస్‌ అధికారులు వ్యవహరించే తీరు చూసి స్ఫూర్తి పొందా. ఐఆర్‌ఎస్‌ వచ్చినా సంతృప్తిపడక ఐఏఎస్‌ కోసం ప్రయత్నించా. మహిళా సాధికారత, పిల్లల సంక్షేమం నా ప్రాధాన్యాంశాలు. సివిల్స్‌ సాధనలో నా తల్లిదండ్రుల పోత్సాహం కీలకంగా నిలిచింది’ అని చెప్పారు.

Updated Date - 2020-08-05T07:30:34+05:30 IST